బిజినెస్

భారతీయ సంపన్నుల్లో గుజరాతీలే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, సెప్టెంబర్ 22: దేశంలో అత్యధికంగా సంపదను సృష్టించే ప్రముఖ పారిశ్రామికవేత్తల జాబితాలో గుజరాతీయుల ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్‌లోని అత్యంత సంపన్నులైన 100 మందితో ప్రముఖ పత్రిక ‘్ఫర్బ్స్’ గురువారం విడుదల చేసిన జాబితాలో అంబానీలు, అదానీలు, సంఘ్వీలు, పటేళ్లు సహా గుజరాత్‌కు చెందిన పలువురు ప్రముఖ స్థానాలను ఆక్రమించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేష్ అంబానీ తన నికర సంపదను గణనీయంగా 22.7 బిలియన్ డాలర్లకు పెంపొందించుకుని ఈ జాబితాలో వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, ఆయన తమ్ముడు అనిల్ అంబానీ 3.4 బిలియన్ డాలర్ల సంపదతో 32వ స్థానంలో నిలిచారు. గుజరాత్‌కే చెందిన సన్ ఫార్మా ఇండస్ట్రీస్ అధినేత దిలీప్ సంఘ్వీ (16.9 బిలియన్ డాలర్లు) ఈ జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించగా, ‘విప్రో’ అధినేత అజీమ్ ప్రేమ్‌జీ (15 బిలియన్ డాలర్లు) నాలుగో స్థానాన్ని, ఉదయ్ కోటక్ (8.3 బిలియన్ డాలర్లు) 11వ స్థానాన్ని, గౌతమ్ అదానీ (6.3 బిలియన్ డాలర్లు) 13 స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో చోటు లభించిన ఇతర గుజరాతీయుల్లో పంకజ్ పటేల్ (4.5 బిలియన్ డాలర్లతో 23వ స్థానం), కర్సన్‌భాయ్ పటేల్ (2.24 బిలియన్ డాలర్లతో 52వ స్థానం), రాజేష్ మెహతా (1.88 బిలియన్ డాలర్లతో 61వ స్థానం), నిరవ్ మోడీ (1.74 బిలియన్ డాలర్లతో 71వ స్థానం) ఉన్నారు.