బిజినెస్

ఎఫ్‌పీఐలదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ) హవా కొనసాగుతున్నది. ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకూ జరిగిన లావాదేవీల్లో ఎఫ్‌పీఐలు అత్యధిక మొత్తంలో వాటాలను కొనుగోలు చేశారు. వరుసగా ఆరో నెల కూడా మార్కెట్లలో ఎఫ్‌పీఐలు కీలక పాత్రను పోషించడం విశేషం. గత వారం మొత్తం ఎఫ్‌పీఐలు కొనుగోలు చేసిన వాటాల విలువ ఏకంగా 6,350 కోట్ల రూపాయలు. అయితే, 1,172.56 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొంత మంది ఎఫ్‌పీఐలు అమ్మేశారు. దీనితో భారత మార్కెట్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులు 5,177.44 కోట్ల రూపాయలుగా నమోదైంది. రుణాల సెగ్మెంట్‌లో పెట్టుబడులకు ఎఫ్‌పీఐలు ఆసక్తిని ప్రదర్శించారని గత వారం మార్కెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ద్రవ్య పరపతి విధానాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకోవడంతోపాటు, రెపో రేట్లను పెంచకపోవడం కూడా ఎఫ్‌పీఐలు రుణాల సెగ్మెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రధాన కారణమైంది. కరోనా వైరస్ విజృంభణ కూడా భారత మార్కెట్లకు పరోక్షంగా ఊతాన్నిచ్చింది. చైనా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం స్పష్టం కనిపిస్తున్నది. అక్కడ దేశీయంగా ఉత్పత్తులు తగ్గిపోగా, పలు దేశాలు చైనా నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశాయి. దీనితో ఎఫ్‌పీఐలకు ప్రత్యామ్నాయంగా భారత రుణాల సెగ్మెంట్ కనిపించింది. విస్తరమైన మార్కెట్ ఉండడంతో, ఈ రంగంలో ఉంచిన పెట్టుబడులకు పూర్తి స్థాయి ఫలితం ఉంటుందన్న నమ్మకం విదేశీ పెట్టుబడిదారుల్లో పెరిగింది. పలు దేశాలతో భారత్ ఇటీవల కాలంలో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు సైతం ఎఫ్‌పీఐలను ఆకట్టుకుంటున్నాయి. సమీప భవిష్యత్తులోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఇదే తీరులో ఉండవచ్చని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.