బిజినెస్

వాణిజ్య ఒప్పందాలపై భారత్, చిలీ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: వాణిజ్య రంగంలో ద్వైపాక్షిక ఒప్పందాలపై భారత్, చిలీ దేశాలు తాజా చర్యలు మొదలు పెట్టాయి. రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాల్లో మైత్రీ సంబంధాలు మరింత పెరుగుపడడమేగాక, పరస్పర సహకారంతో అద్భుత ఫలితాలను సాధించాలన్న లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. 2016 మార్చి 8న ఇరు దేశాలు ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ (పీటీఏ) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం 2008 ఆగస్టులో అమల్లోకి వచ్చింది. 2016లో ఇరు దేశాలు తమతమ వాణిజ్య ఒప్పందాన్ని మరిన్ని రంగాలకు విస్తరించాలని తీర్మానించాయి. కొత్తగా ఎన్నో వస్తుసేవలను జాబితాలో చేర్చాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు పలు రంగాల్లో సహాయసహకారాలు అందచేసుకుంటూ ముందుకు వెళుతున్నాయి.
కాగా, తాజా చర్చల్లో ఈ ఒప్పందం పరిధిని మరింత విస్తృతం చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేస్తారు. అదే విధంగా మరికొన్ని ఉత్పత్తులను లేదా వస్తు సేవలను ఒప్పందాల్లో చేర్చే ప్రయత్నం జరుగుతుందని అధికారులు ప్రకటించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2.85 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇరు దేశాల వాణిజ్యం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2.22 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనితో ఇరు దేశాలు వాణిజ్య సంబంధాల మెరుగుకు నడుం బిగించాయి. తాజా చర్చలతో, మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని, వాణిజ్య, వ్యాపార రంగాల్లో కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయి.