బిజినెస్

దేశీయ మార్కెట్‌లో విదేశీ జీడిపప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11: ప్రస్తుతం మార్కెట్లో భారీ స్థాయిలో వియత్నాం, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్న జీడిపప్పు ఆవరించింది. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఎక్కడి పంట ఎక్కడికైనా సరఫరా చేసుకోవచ్చనే నిబంధన నేపథ్యంలో విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా జీడి గింజలు పెద్దఎత్తున భారత మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. మనకు వినియోగం ఎక్కువ, ఉత్పత్తి తక్కువ కావడంతో పెద్ద ఎత్తున దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జీడిగింజల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. రాష్ట్రంలో జీడిగింజల యూనిట్లు సైతం పెద్ద సంఖ్యలో ఉండటంతో విదేశీ గింజలను దిగుమతి చేసుకుని, ప్రాసెస్‌చేసే కార్యక్రమం భారీగా సాగుతోంది. ప్రధానంగా జీడిగింజలను ఉత్పత్తిచేసే బ్రెజిల్, పశ్చిమ ఆఫ్రికా దేశాలు, దక్షిణ అమెరికా, మలేషియా, వియత్నాం తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి.
డాలర్ హెచ్చు తగ్గులను బట్టి అంతర్జాతీయ మార్కెట్‌పై జీడిగింజల ధరలు ఆధారపడి వుంటుంది. ఘనా, ఫిలికోస్ట్, బెలిన్, ముడికాపాసా, తాంజానియా, దిశాతో వంటి దేశాల నుంచి అత్యధికంగా జీడిగింజల ఉత్పత్తులు అత్యధికంగా దిగుమతి జరుగుతోంది. తాంజానియా నుంచి అత్యధికంగా దిగుమతులు జరుగుతున్నాయి. 80 కిలోల బస్తా రూ.10,600 వరకు ధర పలుకుతోంది.
ఒడిసా, మహారాష్ట్ర, కేరళతో పాటు మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్రంలో జీడిమామిడి తోటలు రియల్ ఎస్టేట్లుగా మారిపోవడం వల్ల చాలా వరకు ఉత్పత్తులు దిగజారాయి. ప్రస్తుతం గిరిజన కార్పొరేషన్ ద్వారా కొండ ప్రాంతాల్లో జీడిమామిడి తోటల విస్తరణ చేస్తున్నారు. రెండు మూడేళ్లకు గానీ జీడి ఉత్పత్తులు చేతికివచ్చే పరిస్థితి లేదు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో అధిక పంట దిగుబడి ఉన్నప్పటికీ అక్కడ ప్రాసెజింగ్ యూనిట్లు తక్కువగా వున్నాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రాసెసింగ్ యూనిట్లు అత్యధికంగా వున్నాయి. ఈ నేపధ్యంలో గింజల దిగుబడికి ప్రాధాన్యతనిస్తున్నారు. దేశీయంగా పండించే జీడి గింజలకు గిరాకీ తగ్గిపోయింది. దీనితో రైతులుల నష్ట పోకుండా ప్రస్తుతానికి దేశీయ ఉత్పత్తుల కోసం అటవీ శాఖ ద్వారా ఉత్పత్తయ్యే జీడిగింజలు మార్కెట్‌కు రాకుండా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ విధంగానైనా రైతుల వద్ద ఉన్న జీడి ఉత్పత్తులకు కాస్తంత ధర లభిస్తుందని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
ఇరవై సంవత్సరాల క్రితం దేశంలోనే భారత్ జీడిగింజల ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉండేది. ఇపుడు మన అవసరాలకు విదేశాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. దీనికి తోడు బ్యాంకులు రుణాలు తగ్గించడం, ఉత్పత్తి వ్యయం పెరిగి పోవడం తదితర కారణాలతో తోటలు తగ్గిపోయాయి. దీంతో పూర్తిగా విదేశీ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఒకపుడు అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే ఈ వాణిజ్య పంట ఇపుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థితి తలెత్తింది. కేరళలో అత్యధికంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఉండేవి. ఇపుడు అక్కడ కూడా తగ్గుముఖం పట్టాయి. నీటి సమస్యలేని జీడితోటలను విస్తరింపజేస్తే రైతులకు మంచి ఆదాయంతో పాటు దేశీయ అవసరాలకు కీలకంగా దోహదపడుతుంది. కేరళ, కర్ణాటకలో జీడి బోర్డులు వున్నాయి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా జీడి బోర్డు ఏర్పాటుచేస్తే రైతులకు మేలు జరుగుతుందని, ప్రభుత్వం జీడి సాగు రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని, ఇతర వాణిజ్య పంటల మాదిరిగా గిట్టుబాటు ధర కల్పించాలని, జీడిపంట సాగు విస్తీర్ణం పెంచేందుకు బ్యాంకు రుణాలు కల్పించాలని గోదావరి కాజూ అసోసియేషన్ గౌరవ సలహాదారు బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రాసెస్ చేసిన తర్వాత జీడిపప్పు గుళ్లు, బద్ద, ముక్క విభాగాలుగా మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ జీడిమామిడి తోటల విస్తీర్ణానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే రైతులకు లాభసాటి వాణిజ్య పంట కానుంది. రాష్ట్రంలో పండించే జీడిపప్పు కూడా 20 కేజీల బస్తా గత ఏడాది రూ.10 నుంచి 11వేల వరకు ధర పలికేది. ఇపుడు రూ.8వేలకు పడిపోవడంతో నష్టపోతున్నామని రైతులు అంటున్నారు.