బిజినెస్

వైజాగ్.. మరో ‘సిలికాన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: స్మార్ట్ సిటీల జాబితాలో చోటు సంపాదించుకున్న విశాఖపట్టణానికి సరికొత్త దశ పట్టనుంది. ఇక మీదట వైజాగ్ ప్రముఖ ఐటి హబ్‌గా సిలికాన్ వ్యాలీ తరహాలో అభివృద్ధి చెందనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. దీనికి ఐటి వర్గాల నుండి కూడా సానుకూల స్పందన వస్తోంది. 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటి టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే భారీ పరిశ్రమలతో పాటు జల,రోడ్డు, రైలు, ఆకాశ రవాణా వంటి వౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మెగా ఐటి హబ్‌కు గుర్తుగా రుషికొండలో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక సిగ్నేచర్ టవర్ - మిలీనియం టవర్‌ను నిర్మిస్తారు.
ప్రభుత్వం కల్పించే భారీ రాయితీలతో రుషికొండ, గంభీరం, కాపులుప్పాడు ప్రాంతాల్లో ఐటి కంపెనీలు ఏర్పాటు చేయడానికి దేశ విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. సొంత భూమిలో భారీ ఐటి కంపెనీలను స్థాపించి ఉపాధి కల్పించే సంస్థలకు ఉద్యోగానికి లక్షరూపాయిలు చొప్పున ప్రభుత్వం రాయితీ ఇవ్వబోతోంది. రాష్ట్రప్రభుత్వం నుండి భూమి పొందిన భారీ కంపెనీలకు ఉద్యోగానికి 50వేలు చొప్పున రాయితీ ఇస్తారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీల విషయంలో ఏకంగా ఉద్యోగానికి లక్షన్నర రాయితీ ఇవ్వబోతున్నారు. టెక్ మహేంద్ర, విప్రో వంటి కంపెనీలు తమ సంస్థల ఏర్పాటుకు సన్నాహాలు పూర్తి చేశాయి. అమెరికాకు చెందిన సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్షన్ - శాప్ సంస్థ రాష్ట్రంలో 1.3 బిలియన్ డాలర్లు పెట్టుబడికి సిద్ధపడింది. శాప్‌తో కలిసి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా విశాఖలో స్టార్టప్ యాక్సిలేటర్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ రూపొందించిన హనా టెక్నాలజీ ద్వారా స్టార్టప్ కంపెనీలకు విలువైన సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను ఉచితంగా అందిస్తోంది.
విశాఖకు మెగా సిటీగా రూపొందేందుకు అవసరమైన అన్ని హంగులూ ప్రభుత్వం సమకూరుస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రెండు పోర్టులున్నాయి. ఐటి హబ్‌తో పాటు మెట్రో రైలు, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్, ఎగ్జిబిషన్ కమ్ కనె్వన్షన్ సెంటర్, గంగవరం ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ వంటివి రానున్నాయి. జిల్లాలో ఇప్పటికే 5577 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేశారు. ఇందులో 3743 ఎకరాల పరిధిలో ఎపిసెజ్ ఉది. 971 హెక్టార్లలో జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ ఉంది. దేశంలో ఉన్న ఏకైక ఫార్మా సెజ్ ఇదే.
కాగా,విశాఖపట్టణంతో పాటు విజయవాడ, కాకినాడ, తిరుపతి, అనంతపురం పట్టణాలను కూడా ఐటి హబ్‌లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఐటి జోన్లు, ఐటి పార్కులు, ఐటి టవర్లలో పారదర్శకంగా పిపిపి పద్ధతిలో సౌకర్యాలు, వౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో పక్క రాష్ట్రానికి వైజాగ్‌ను ఆర్ధిక రాజధానిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉంది. దేశంలో ముంబై తర్వాత విశాఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సింగపూర్‌కు చేరువగా ఉండటం ఇందుకు బాగా దోహదం చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞాన రంగంలో కీలకమైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పై శిక్షణకు జపాన్‌కు చెందిన కీ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.