బిజినెస్

జీఎస్‌టీలో కొత్త విధానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: జీఎస్‌టీ విధానంలో కొత్త విధానాలు వచ్చాయని దీంతో సిబ్బందిపై బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పని చేస్తున్నారని సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఎం శ్రీహరిరావు తెలిపారు. ఆలిండియా అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ గెజిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గుంటూరు యూనిట్ జనరల్ బాడీ సమావేశం శనివారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీహరిరావు మాట్లాడుతూ గుంటూరు కమిషనరేట్ దేశంలోనే అతి పురాతనమైన కమిషనరేట్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారిగా గుంటూరులోనే కమిషనర్ కార్యాలయం ప్రారంభించారన్నారు. గుంటూరులో పొగాకు కొనుగోళ్లు పెద్ద స్థాయిలో ఉండటంతో ఇక్కడే కమిషనర్ కార్యాలయం ప్రారంభించారన్నారు. అలాగే 2017 నుండి సెంట్రల్ ఎక్సైజ్ పన్ను విధానం మార్పు చెంది జీఎస్‌టీ కొత్త చట్టం వచ్చిందని తెలిపారు. దీంతో గుంటూరులోనే సీజీఎస్‌టీ కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటు చేశారన్నారు. ప్రధానంగా ఈ ఏడాది పన్నుల విధానంలో 15 శాతం వృద్ధి సాధించే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించారని, దానికి అనుగుణంగా సిబ్బంది అంతా సమర్థవంతంగా పని చేస్తున్నారని తెలిపారు. కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనర్ డాక్టర్ కే వెంకటరామ్‌రెడ్డి మాట్లాడుతూ జీఎస్‌టీ గుంటూరు యూనిట్‌లో సిబ్బంది కరిసికట్టుగా పని చేసి మంచి ఫలితాలను సాధిస్తున్నారని తెలిపారు. కస్టమ్స్ విభాగానికి సంబంధించి కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు దిగుమతులు పెరిగాయని దీనికి అనుగుణంగా పన్నులను రాబట్టడంలో కృషి చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది కస్టమ్స్ విభాగం నుండి పన్నుల రూపంలో రూ. 10వేల కోట్లు రాబట్టామని ఈ ఏడాది రూ. 12 వేల కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నామని నూరుశాతం లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా కంటెయినర్లలో ఓపెన్ చేయకుండానే అక్రమ రవాణా జరుగుతుందేమో తెలుసుకోవడానికి అత్యాధునిక కంటెయినర్ స్కానర్లను ఉపయోగిస్తున్నామని తెలిపారు.
ఆలిండియా అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ గెజిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గుంటూరు యూనిట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీబీజీ తిలక్, ఎం. నాగరాజు మాట్లాడుతూ గుంటూరు యూనిట్‌లో మొత్తం 250 మంది సూపరింటెండెంట్‌లు ఉన్నారని, వారికి సంబంధించి ప్రమోషన్లు, సర్వీస్ రూల్స్, సిబ్బంది సంక్షేమం గురించి చర్చించి పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఎస్ రమేష్‌బాబు, అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి రవి మల్లిక్, ఆలిండియా అధ్యక్ష, కార్యదర్శులు తవనమ్‌దాస్, హర్పాల్ షింగ్, జీఎస్‌టీకి చెందిన సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ కమిషనర్లు, 13 జిల్లాల కస్టమ్స్ అధికారులు పాల్గొన్నారు.