బిజినెస్

ఆందోళన కలిగిస్తున్న ఆర్థిక మాంద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ఆందోళన కలిగిస్తున్నది. వృద్ధిరేటు అంచనాల కంటే తక్కువగా నమోదుకావడం, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కూడా మందగించడం, మాంద్యం శాతం పెరగడం వంటి అంశాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొందని, మాంద్య పరిస్థితులతో దాదాపు అన్ని దేశాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మన దేశంలో పరిస్థితి ఆశాజనకంగానే ఉందని వ్యాఖ్యానించారు. అంతేగాక, గత 11 సంవత్సరాల్లో ఎన్నడూ లేని రీతిలో ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు కేవలం ఐదు శాతం మాత్రమే ఉంటుందని, అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడి ఆరు శాతానికి మించుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఆర్థిక మాంద్యం, హోల్‌సేల్ ప్రైమరీ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)కి సంబంధించి కేంద్రం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే, పరిస్థితి అనుకున్నంత ఆశాజనకంగా ఏమీ లేదని స్పష్టమవుతుంది. అన్ని వస్తువులను స్థూలంగా పరిగణలోకి తీసుకుంటే, మాంద్యం 2.76 శాతంగా కేంద్రం అంచనా వేసింది. కానీ, వాస్తవానికి గత నెలాఖరు నాటికి ఇది 3.10 శాతానికి పెరిగింది. హోల్‌సేల్ ధరల సూచీ 112.8గా అంచనా వేయగా, 122.9కు చేరింది. ప్రాథమిక వస్తువుల రంగంలో మాంద్యం కేవలం మూడు శాతం ఉంటుందని అంచనా వేస్తే, ఏకంగా 10.01 శాతానికి పెరిగింది. డబ్ల్యూపీఐ 147.2 శాతంగా నమోదైంది. ఆహారోత్పత్తుల విషయానికి వస్తే 2.41 శాతంగా ఉన్న మాంద్యం అంచనా 11.51 శాతానికి ఎగబాకింది. డబ్ల్యూపీఐ 160.8 శాతానికి చేరింది. నాన్ ఫుడ్ ఉత్పత్తుల రంగంలో మాంద్యం అంచనా 2.32 శాతంకాగా, 7.05 శాతానికి పెరిగింది. డబ్ల్యూపీఐ 132.1 శాతం. ఇంధనం, విద్యుత్ రంగంలో మాంద్యాన్ని 1.85 శాతంగా అంచనా వేస్తే 3.42 శాతానికి చేరుకొని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ విభాగంలో డబ్ల్యూపీఐ 102.7 శాతంగా నమోదైంది. తయారైన వస్తువుల రంగంలో మాత్రం పరిస్థితి కొంత వరకూ ఆశాజనకంగా కనిపిస్తున్నది. మాంద్యం 2.79 శాతం వరకూ ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ, అది కేవలం 0.34 శాతానికే పరిమితమైంది. డబ్ల్యూపీఐ 118.5 శాతంగా ముగిసింది.
మొత్తం మీద స్థూలంగా చూస్తే ఆర్థిక మాంద్యం గత ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాలతో పోలిస్తే కొంత తక్కువగానే ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా నమోదవుతున్న పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది. గత ఏడాది జనవరి మాసంలో మాంద్యం 2.76 శాతంకాగా, ఫిబ్రవరిలో 2.93 శాతానికి చేరింది. మార్చిలో 3.18 శాతం, ఏప్రిల్‌లో అత్యధికంగా 3.24 శాతంగా నమోదైంది. కానీ ఆతర్వాత తగ్గు ముఖం పట్టింది. మే మాసంలో 2.79 శాతం, జూన్‌లో 2.02 శాతానికి తగ్గింది. జూలై, ఆగస్టు మాసాల్లో 117 శాతానికి చేరింది. సెప్టెంబర్‌లో కేవలం 0.33 శాతంకాగా, అక్టోబర్‌లో అంతకంటే తక్కువగా 0.16 శాతానికే పరిమితమైంది. నవంబర్‌ల 0.58 శాతంగా ఉన్న మాంద్యం డిసెంబర్‌లో 2.59 శాతానికి చేరడంతో, ద్రవ్యోల్బణ పరిస్థితులు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో 3.10 శాతంగా నమోదు కావడం ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దం పడుతున్నది.