బిజినెస్

8 కంపెనీల మార్కెట్ విలువ జాబితాలో రిలయన్స్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశంలోని ‘టాప్-10’ జాబితాలో ఉన్న ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ గత వారం సుమారు లక్ష కోట్ల రూపాయలు పెరిగింది. రిలియన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) అత్యధికంగా లాభపడింది. మార్కెట్ గణాంకాలను అనుసరించి, గత వారంలో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ 1.09 లక్షల కోట్లు పెరిగింది. రిల్‌తోపాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హిందుస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్ర, ఇన్ఫోసిస్ కంపెనీల మార్కెట్ విలువ కూడా మెరుగుపడింది. టాప్-10 జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ విలువ మాత్రమే పతనమైంది. తాజా గణాంకాల ప్రకారం గత వారం రిల్ మార్కెట్ విలువ 33,534.56 కోట్లు పెరగడంతో 9,42,422.58 కోట్ల రూపాయలకు చేరింది. హెచ్‌యూఎల్ 20,619.84 కోట్లు మెరుగుపడి, 4,88,132.65 కోట్ల రూపాయలుగా నమోదైంది. టీసీఎస్ మార్కెట్ విలువ 17,673.73 కోట్లు పెరగడంతో 8,19,445.77 కోట్ల రూపాయలకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్ 13,911.68 కోట్ల రూ పాయలను జత చేసుకొని 3,08,293.55 కోట్ల రూ పాయలకు ఎదిగింది. బజాజ్ ఫైనాన్స్ 8,014.92 కోట్ల లాభంతో 2,87,802.92 కోట్ల రూపాయలకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ 6,138.65 కోట్ల రూపాయలు అధికమై, 3,53,225.18 కోట్ల రూపాయలుగా ఉంది.
కోటక్ మహీంద్ర బ్యాంక్ 5,666.73 కోట్ల రూపాయలను జత పరచుకొని, మార్కెట్ విలువను 3,21,586.80 కోట్ల రూపాయలకు పెంచుకుంది. అదే విధంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ 3,832.80 కోట్ల రూపాయలు పెరగడంతో, 3,34,816.02 కోట్ల రూపాయలకు చేరింది. ఈ కం పెనీలన్నీ లాభాల్లో పరుగులు తీస్తే, అందుకు భిన్నంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ 12,409.10 కోట్ల నష్టంతో 6,67,982.74 కోట్ల రూపాయలకు పడిపోయింది. హెచ్‌డీఫ్‌సీ 777.55 కోట్ల నష్టంతో 4,15,225.74 కోట్ల రూపాయలకు పరిమితమైంది. కాగా, దేశంలో మార్కెట్ విలువ అత్యధికంగా ఉన్న టాప్-10 జాబితాలో రిల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఆతర్వాతి స్థానాల్లో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్ర బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. గత వారం సెనె్సక్స్ 115.89 పాయింట్లు (0.28 శాతం) మెరుగుపడింది.