బిజినెస్

పరిశ్రమలు, ఎగుమతులపై కరోనా వైరస్ ప్రభావం పడనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశీయ పరిశ్రమలు, ఎగుమతులపై కరోనా వైరస్ ప్రభావాన్ని మదింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పలు చర్యలు చేపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడిక్కడ ప్రకటించారు. ప్రధాన మంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ చర్యలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు. దేశీయ పరిశ్రమలపై కరోనా వైరస్ ప్రభావం గురించి చర్చించేందుకు ఫార్మా, జౌళి, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్‌వేర్ రసాయనాలు, మొబైల్ ఉత్పత్తులు, టూరిజం, షిప్పింగ్ రంగాలకు చెందిన ప్రతినిధులు నిర్మలా సీతారామన్‌ను కలుసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఎగుమతులతో పాటు ముడి పదార్థాల దిగుమతులకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ సమావేశంలో వీటిపై కూడా చర్చించామని సీతారామన్ తెలిపారు. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులతో బుధవారం తాను విడిగా సమావేశమవుతానని అనంతరం కరోనా వైరస్ ప్రభావాన్ని నిరోధించే చర్యలను ప్రకటిస్తానని తెలిపారు. అన్ని వర్గాలతో చర్చించి ఏ రకమైన పరిష్కార మార్గాన్ని అనుసరించాలో నిర్ణయిస్తామని ఆమె తెలిపారు. ఈ వైరస్ కారణంగా ఫార్మా, రసాయనాలు, సోలార్ పరికరాల రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని ఆమె చెప్పారు. ముఖ్యంగా నౌకలకు ఎక్కించిన సరుకులు సకాలంలో రాకపోవడం వల్ల ఈ మూడు రంగాలు తీవ్ర స్థాయిలోనే సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. అలాగే ధరల పెరుగుదల అంశం కూడా ఆందోళన కలిగిస్తున్నదని, అయితే ఇప్పటికిప్పుడే మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలపై ఈ వైరస్ ప్రభావాన్ని అంచనా వేయలేమన్నారు.

*చిత్రం... కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్