బిజినెస్

తొలి 5-జీ హ్యాండ్ సెట్ రూ.50 వేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 19: భారతదేశంలో తొలి 5-జీ హ్యాండ్‌సెట్‌లను చైనాకు చెందిన ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మి ప్రవేశపెట్టనుంది. దీని ధర సుమారు 50 వేల రూపాయలు ఉండవచ్చునని ఆ కంపెనీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 2018లో ప్రారంభమైన రియల్ మి అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ సెల్‌ఫోన్ మార్కెట్లను కొళ్లగొట్టింది. ఇప్పుడు 5-జీ స్మార్ట్ఫోన్‌ను తయారు చేసిన మొదటి కంపెనీగా కూడా రికార్డు సృష్టించనుంది. ఈ ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఈనెల 24న విడుదల చేస్తున్నట్టు ఆ కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. 865 స్నాప్ డ్రాగన్ చిప్ సెట్‌తో కూడిన ఈ ఫోన్‌కు భారత మార్కెట్‌లో విశేషమైన ఆదరణ లభిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. 5-జీ హ్యాండ్‌సెట్ల కనీస 25,790 రూపాయలుగా ఉంటుందని ప్రకటించింది. భవిష్యత్ అవసరాలకు తగిన రీతిలో అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయని ఆ కంపెనీ పేర్కొంది.