బిజినెస్

‘అవినీతి’పై చర్యలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి బడా పారిశ్రామికవేత్తలు తీసుకొని, ఎగ్గొట్టిన బకాయిలు లక్షల కోట్లు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకూ సరైన ఎవరూ సరైన దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసే స్థాయి భారీ కుంభకోణాలపైనా ఇప్పటి వరకూ విచారణలు చెప్పుకోదగిన రీతిలో ముందుకు సాగడం లేదు. విజయ్ మాల్య లేదా లలిత్ మో దీ.. నీరవ్ మోదీ లేదా మెహుల్ చోక్సీ.. ప్రభుత్వ రంగ బ్యాంకులను పూర్తిగా ముంచేసిన ఎంతో మందిపై కేసులు ఎడతెగడం లేదు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరగడం లేదు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తూ, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై విచారణలో తీవ్ర జాప్యం జరుగుతున్నదనే మాట వాస్తవం. పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దాలో తెలియక కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కూడా దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నది. పంజా బ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐలోనూ కొం తమంది ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇతర ప్రభుత్వ సంస్థలు, శాఖల్లోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారున్నారు. ఈ జాబితాలో ఐఏఎస్ అధికారులు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అత్యున్నత పదవుల్లో ఉండి, అవినీతికి పాల్పడినట్టు వీరి పై కేసులు నమోదయ్యాయికానీ విచారణ మాత్రం నత్తనడన సాగుతున్నది. అవినీతి నిరోధక విభాగాలు, ఇతరత్రా సంస్థలు సైతం వీరిని నిందితులుగా ధ్రువీకరించినప్పటికీ, చర్యలు తీసుకోలేకపోతున్నాయి. ఆయా శాఖలు విచారణ జరిపిన తర్వాత, తదుపరి విచారణ సీవీసీ జరపాల్సి ఉం టుంది. అవినీతికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని సీవీసీ కోరినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. పలు కేసుల్లో ఇప్పటి వరకూ అనుమతి రాలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన అధికారులు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్తలు దుమారం రేపుతున్నాయి. పలువురు బడా వ్యాపారవేత్తలు బ్యాంకుల నుంచి కొన్ని వేల కోట్లా రూపాయల రుణాలు తీసుకొని, ఆతర్వాత వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నేపథ్యం లో, అవినీతి ఆరోపణలపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపించి, దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. కా నీ, ఈ దిశగా అడుగులు పడడం లేదన్నది వాస్తవం.