బిజినెస్

కలిసొచ్చిన కోవిడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూర్: యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ‘కోవిడ్’ వైరస్ ఎన్నో రంగాలను దెబ్బతీస్తే, తమిళనాడు దుస్తుల పరిశ్రమ మాత్రం ఈ వైరస్ పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. నిజానికి మన దేశంలో మొదటి రెండు కోవిడ్ కేసులు కేరళలో నమోదయ్యాయి. ఆ తర్వాత మిగతా ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. కేరళ సరిహద్దులో ఉన్న తమిళనాడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. దీంతో రాష్ట్రం మొత్తం అప్రమత్తమైంది. ఏమాత్రం అనుమానం వచ్చినా బాధితులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స జరిపిస్తోంది.
అయితే, ఈ కోవిడ్ పరోక్షంగా తమకు సహకరిస్తోందని తమిళనాడు దుస్తుల పరిశ్రమల యజమానులు సంతోషిస్తున్నారు. అమెరికా, యూకే, కెనడా తదితర ప్రాంతాలకు చైనా నుంచి అత్యధికంగా దుస్తులు ఎగుమతి అవుతాయి. అయితే, కోవిడ్ కారణంగా అక్కడ నుంచి వీటి దిగుమతులకు ఆయా దేశాలు ఇప్పుడు ఆసక్తి ప్రదర్శించడం లేదు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కోయంబత్తూర్ దుస్తుల పరిశ్రమల యాజమాన్యాలు ఎగుమతులను రెండు, మూడు రెట్లు పెంచాయి. ఇన్నాళ్లూ దుస్తుల కోసం చైనాపైనే ఆధారపడిన చాలా దేశాలు ఇప్పుడు భారత్‌పై దృష్టి మళ్లిస్తున్నాయి. కోవిడ్ వ్యాప్తి కారణంగా చైనా ఎగుమతులు తగ్గిపోతే ఆ స్థానాన్ని భారత్ భర్తీ చేస్తోంది. తమిళనాడు చేనేత వస్త్ర పరిశ్రమ శాఖ డైరెక్టర్ కరుణాకరన్ బుధవారం కొత్త టెక్స్‌టైల్స్ పాలసీని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో చైనా నుంచి దిగుమతి అవుతున్న దుస్తుల స్థానంలోనే తమిళనాడు దుస్తులు ఎగుమతి కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాటన్, పాలిస్టర్, క్వాలీ కాటన్, పాలిస్టర్-విస్కోస్ బ్లెండ్ ఫ్య్రాబ్రిక్‌తో తయారు చేసిన దుస్తులకు అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో మంచి డిమాండ్ ఉందని ఆయన అన్నారు. 80 శాతం కాటన్, 20 శాతం బనానా ఫైబర్‌తో తయారయ్యే కాటన్ దుస్తులకు కూడా విపరీతమైన డిమాండ్ ఉన్నట్టు ఆయన చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని డిమాండ్‌కు తగినట్టు ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.