బిజినెస్

భారతి ఎయిర్‌టెల్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: బకాయిలను చెల్లించాల్సిన మొత్తాలను పెండింగ్‌లో పెట్టిన కారణంగా కొంతకాలంగా ‘వాచ్ నెగెటివ్’ జాబితాలో చేరిన ప్రముఖ టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ఊర ట లభించింది. ఫిచ్ రేటింగ్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. బెటర్ బిజినెస్ బ్యూరో (బీబీబీ)లో భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రతికూల ముద్ర పడిన విష యం తెలిసిందే. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మూడు నెలలు అదనంగా గడువు ఇచ్చినప్పటికీ టెలికం సంస్థలు బకాయిలను చెల్లించకపోవడంపై సుప్రీం ఇటీవల తీవ్ర ఆహ్రం వ్యక్తం చేసిన విషయం తెలిసిం దే. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కాగా, ఏజీఆర్ బకాయిలు భారీగా చెల్లించాల్సి ఉన్న భారతీ ఎయిర్‌టెల్‌ను ఫిచ్ రేటింగ్ సంస్థ తన టాప్ లిస్టింగ్ కంపెనీల జాబితా నుంచి తొలగించి, ‘వాచ్ నెగెటివ్’ జాబితాలో ఉంచింది. అయి తే, ఇటీవలే రూ.10,000 కోట్ల బకాయిలను భారతీ ఎయిర్‌టెల్ చెల్లించింది. అంతేగాక, వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థిరీకరణకు చర్యలు చేపట్టింది. ఈ పరిణాలను గమనించిన తర్వాత, ‘వాచ్ నెగెటివ్’ జాబితా నుంచి భారతీ ఎయిర్‌టెల్‌ను ఫిచ్ రేటింగ్స్ తొలగించింది.
టెలికం రంగాన్ని ఆదుకోవాలి..
ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న టెలికం రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిత్తల్ కోరారు. ఏజీఆర్ కారణంగా టెలికం సంస్థలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏజీఆర్ వల్ల మోయలేని భారం పడుతున్నదని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం ముందుకు రావాలని తెలిపారు.