బిజినెస్

అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 20: ఎగుమతులను పెంచుకోవడంతోపాటు, ఆర్థికంగా స్థిర పడేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) పిలుపునిచ్చింది. కరోనా వైరస్ కారణంగా చైనాలో ఉత్పత్తి దారుణంగా పడిపోయిందని, అదే విధంగా ఆ దేశం నుంచి దిగుమతులకు ప్రపంచ దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయని తెలిపింది. ఫాస్ట్ ట్రాక్ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉత్పత్తులను పెంచాలని, ఇది జీడీపీ వృద్ధి రేటుకు కూడా దోహదపడుతుందని పిక్కీ ప్రధాన కార్యదర్శి దిలీప్ షినాయ్ అన్నారు. చైనాకు భారత దేశం మాత్రమే ప్రత్యామ్నాయమని, కాబట్టి, ఈ అవకాశాన్ని అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవడానికి నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందుకొచ్చి, తగిన చర్యలు తీసుకోవాలని పీటీఐతో మాట్లాడుతూ సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య కోఆర్డినేషన్ విధానాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడితే మంచి ఫలితాలు ఉంటాయని అన్నా రు. మానవీయ కోణంలో చైనా పరిస్థితిని అర్థం చేసుకుంటున్నామని, అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. అయితే, చైనా నుంచి వివిధ దేశాలకు దిగుమతులు తగ్గిన కారణంగా, ఆ లోటును భర్తీ చేసే రీతిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ సమయం లేదు కాబట్టి, ఫాస్ట్ ట్రా క్ పెట్టుబడులను ఆహ్వానించి, ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని చెప్పారు. తక్కు వ సమయంలో, ఎక్కువ సంఖ్యలో ఏఏ వస్తువులను ఉత్పత్తి చేయగలమో నిర్ధారించుకొని, అందుకు తగినట్టుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రస్తు తం ఇది స్వల్పకాల అంశంగా కనిపిస్తున్నప్పటికీ, వివిధ దేశాలకు భారత్ ఎగుమతులను పెంచుకోవడానికి వచ్చిన అవకాశంగా చూడాల్సి ఉంటుందని షినాయ్ పేర్కొన్నారు. అంతేగాక, చైనా నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటున్న వస్తుసేవల స్థానంలో దేశీయ ఉత్పత్తులు ఉండాలని కోరారు. దేశంలో చైనాకు ఉన్న మార్కెట్‌ను స్వదేశీ పెట్టుబడిదారులు కొల్లగొట్టాలని పిలుపునిచ్చారు. మొత్తం మీద చైనాలో తీవ్రమవుతున్న కరోనా వైరస్ సమస్య పూర్తిగా తగ్గే వరకూ, ఆ దేశ మార్కెట్‌ను భారత్ అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన సమయమని అన్నారు.