బిజినెస్

దూసుకెళ్తున్న ఆటోమొబైల్ రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో విజయవాడ నగరం తొలి నుంచీ ఆటోమొబైల్ రంగానికి ప్రధాన కేంద్రం. ద్విచక్ర వాహనాల నుంచి కార్లు, మినీ వ్యాన్లు, బస్సులు, ట్రక్కులు, ట్రాలీలు, ట్యాంకర్లు ఇలా అన్నిటికీ విజయవాడ హబ్‌గా మారింది. వరల్డ్ బ్రాండ్ ఏదైనా సరే అది తొలుత బెజవాడకు రావాల్సిందే. రవాణా రంగ హబ్‌గా ఉన్న ఈప్రాంతంలో ఆటోమొబైల్ రంగానికి మరింత ఊపునిచ్చేలా మార్కెట్‌లోకి దిగ్గజ బ్రాండ్స్ షోరూమ్‌లు వస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా తాజాగా ‘కియా’ కార్ల షోరూమ్ ఏర్పాటు కాగా, మల్లవల్లిలోని అశోక్ లేల్యాండ్ కంపెనీ నుంచి ఎలక్ట్రికల్ బస్సు త్వరలోనే బయటకు రానుంది.
ఈ రెండూ ప్రపంచ దిగ్గజ వాహన తయారీ సంస్థలు కావటం గమనార్హం. విజయవాడ కేంద్రంగా లగ్జరీ కార్ల వ్యాపారంతో పాటు బస్సులు, ట్రక్కులు, లారీల వ్యాపారం కూడా పెద్దఎత్తున జరుగుతోంది. నగరంలో ఇటీవలి కాలంలో ఆడి వాహనాల షోరూమ్ కూడా ఏర్పాటైంది. తాజా పరిణామాలు ఆటోమొబైల్ రంగానికి మరింత ఊతమిస్తున్నాయి. మల్లవల్లి కేంద్రంగా అశోక్ లేల్యాండ్ సంస్థకు చెందిన ఎలక్ట్రికల్ బస్సులు మార్కెట్‌లోకి రానున్నాయి. దక్షిణ భారతదేశంలో మార్కెట్‌ను విస్తృతం చేసుకోటానికి వీలుగా మల్లవల్లిలో ఈ సంస్థ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగ వాహనాలను తయారుచేయాలన్న దిశగా సంస్థ పరిశోధనలు జరిపింది. అనేక అధ్యయనాల అనంతరం నెక్ట్స్ జనరేషన్ వాహనాలైన ఎలక్ట్రికల్ వాహనాలకు శ్రీకారం చుట్టింది. దక్షిణ భారతదేశంలో మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భారీ బస్ బాడీ ప్లాంట్‌ను నెలకొల్పింది. ఎలక్ట్రికల్ బస్సుల తయారీలో అశోక్ లేల్యాండ్ సంస్థ ఇప్పటికే మంచిపేరు సంపాదించింది. ఖరీదు ఎక్కువ కాకుండా బడ్జెట్‌లోనే ఎలక్ట్రికల్ వాహనాలను తీసుకురాగలగటం దీని ప్రత్యేకత. ఇక కియా అనంతపురం జిల్లాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కియా ప్లాంట్‌లో కార్ల ఉత్పత్తులు జరుగుతున్నాయి. అక్కడ తయారవుతున్న కార్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన అనేక కార్ల మోడల్స్ విజయవాడ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. 16వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి బెంజి సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ సెంటర్‌కు వెళ్లే మార్గంలో కియా కార్ల షోరూమ్ ఏర్పాటు చేశారు. అనంతపురంలో కార్ల ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా కొత్త డీలర్‌షిప్‌కు ఆ సంస్థ వెబ్‌పోర్టల్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలో నగరానికి చెందిన ఒక బిగ్‌షాట్ కియా డీలర్‌షిప్‌ను తీసుకున్నారు.
కియా సంస్థ ప్రపంచవ్యాప్తంగా క్రాస్ ఓవర్స్, ఎస్‌యూవీఎస్, మినీ వ్యాన్లు, సెడాన్స్, హైబ్రిడ్స్ అండ్ ఈవీ, హాచ్‌బ్యాక్స్ శ్రేణిలో అనేక మోడళ్లతో కూడిన కార్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. అనంతపురం జిల్లాలో రూపొందే బడ్జెట్ కార్లతో పాటు ప్రపంచ స్థాయి మోడల్స్ అన్నీ విజయవాడ షోరూమ్‌లో కొలువు దీరనున్నాయి.