బిజినెస్

25 నుంచి అందుబాటులో ఎయిర్ కార్గో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 23: విశాఖ విమానాశ్రయం నుంచి ఎయిర్ కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 25వతేదీ నుంచి ఎయిర్ కార్గో సర్వీసును నడిపేందుకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ సన్నాహాలు పూర్తి చేసుకుంది. తొలుత ఎయిర్‌కార్గో సర్వీసును ఈ నెల 15వతేదీ నుంచి నడపాలని భావించినప్పటికీ రక్షణ శాఖ ఆధీనంలోని ఎయిర్‌పోర్టు వర్గాలు సమయం కేటాయించలేదు. దీంతో ఎయిర్‌కార్గో సేవలు అందుబాటులోకి రావడానికి జాప్యం చోటుచేసుకుంది. అయితే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చొరవ తీసుకుని రక్షణ రంగం ప్రతినిధులతో సంప్రదించి ఎయిర్‌కార్గో సర్వీసు నడిపేందుకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ అడిగిన సమయాలను కేటాయించేలా చూశారు. దీంతో ఈ నెల 25 వతేదీ నుంచి ఎయిర్‌కార్గో సేవలు విశాఖ విమానాశ్రయం నుంచి అందుబాటులోకి రానున్నాయి. చెన్నై నుంచి వైజాగ్ మీదుగా కోల్‌కతా, చెన్నై నుంచి వైజాగ్ మీదుగా సూరత్‌కు రెండు మార్గాల్లో వారానికి ఆరు రోజుల పాటు ఎయిర్‌కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి. విశాఖలో ఫార్మా, బ్రాండిక్స్ వంటి పరిశ్రమలకు ఎయిర్ కార్గో అవసరంపై ఎన్నాళ్లుగానో వినతులు ఇస్తున్నా స్పందించలేదు. చివరకు ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని స్పైస్ జెట్ విమానయాన సంస్థ ముందుకు రావడంతో ఎయిర్‌కార్గో సేవలు అందుబాటులోకి వస్తుండడం స్వాగతించతగ్గ పరిణామంగా పేర్కొంటున్నారు.