బిజినెస్

చైనా 5జీ స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: చైనాకు చెందిన రియల్‌మే మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ సోమవారం భారత్ మార్కెట్‌లో తొలి 5జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్ల ధరలు రూ.37,999 నుంచి ప్రారంభవుతాయి. రియల్‌మే ఫోన్లను భారత్ మార్కెట్‌లో ప్రవేశ పెట్టడం తమకు ఎంతో సంతోషకరంగా ఉందని రియల్‌మే ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి (సీఇవో) మాధవ్ సేత్ అన్నారు. తొలుత మూడు రకాల మొబైల్ ఫోన్లను ప్రవేశ పెట్టామని ఆయన తెలిపారు. అవి రూ.37,999, రూ.39,999, రూ.44,999గా ధరలు నిర్ణయించామన్నారు. మెమోరీ కార్డు వినియోగదారులను బట్టి తీసుకోవచ్చన్నారు. టెక్‌ఏఆర్‌సీ సంస్థ వ్యవస్థాపకుడు, మార్కెట్ల పరిశోధన విశే్లషకుడు ఫైసల్ కౌవూసా మాట్లాడుతూ ఈ మొబైల్ ఫోన్ల ధరలు అధికంగా ఉన్నాయనిపించినా, మున్ముందు ధరలు తగ్గుతాయని తెలిపారు. 2022 సంవత్సరంలోగా తగ్గవచ్చన్నారు. లోగడ తాము 4జీ మొబైల్‌ను ప్రారంభించినప్పుడు ఒక మొబైల్ ధర రూ.45,000గా నిర్ణయించామని, అయితే ఆ ధర ఇప్పుడు భారీగా తగ్గిందన్నారు. 4జీ, 5జీ స్మార్ట్ మొబైల్ ఫోన్లలో రెండు సిమ్ కార్డులు ఉపయోగించవచ్చని ఆయన వివరించారు.