బిజినెస్

రెండో రోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 25: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నాటి భారీ పతనం నుంచి కొలుకుంటున్నప్పటికీ, వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లోనే కొనసాగాయి. ఈవారం లావాదేవీలకు మొదటి రోజైన సోమవారం బాంబే స్టాక్ ఏక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 806.89 పాయింట్లు పతనమై, 40,363.23 పాయింట్లకు పడిపోయిన విషయం తెలిసిందే. అదే విధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 251.45 పాయింట్లు తగ్గి, 11,829.40 పాయింట్ల వద్ద ముగిసింది. రెండో రోజున ఆ స్థాయిలో పతనం లేకపోయినప్పటికీ, నిలకడలేకుండా కొనసాగిన ట్రేడింగ్ చివరికి మార్కెట్లను నష్టాల్లోనే నిలబెట్టింది. సెనె్సక్స్ 82.03 పాయింట్ల నష్టంతో 40,281.20 పాయింట్లకు చేరాయి. అదే విధంగా నిఫ్టీ 31.50 పాయింట్లు తగ్గడంతో 11,797.90 పాయింట్లుగా నమోదైంది. ఈవారం తొలి రోజున నమోదైన భారీ పతనానికి మారిషస్‌కు ఫైనానిషయల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) జాబితాలోని ‘గ్రే లిస్ట్’లో చోటు దక్కడమే ప్రధాన కారణమైందని విశే్లషకుల అభిప్రాయం. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలని అటు మదుపరులు, ఇటు స్టాక్ బ్రోకర్లు కోరుకున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడులను స్వీకరించే అవకాశాన్ని మరిషస్ కూడా అందిపుచ్చుకోవడంతో, భారత్‌లో పెట్టుబడులు తగ్గవచ్చన్న అనుమానాలు మదుపరుల ఆలోచనా విధానంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ ప్రభావం నుంచి మార్కెట్లు మంగళవారం కొంత వరకూ కోలుకున్నట్టే కనిపించింది. కానీ, నష్టాలు మాత్రం తప్పలేదు. బీఎస్‌ఈలో సన్ ఫార్మా స్టాక్స్ అత్యధికంగా 2.37 శాతం నష్టాలు ఎదుర్కొన్నాయి. హెచ్‌సీఎల్ టెక్ 2.10 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1.98 శాతం, ఇండస్‌ఇండ్ 1.42 శాతం, ఎల్ అండ్ టీ 1.36 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. అయితే, టీసీఎస్ ప్రతికూల పరిస్థితుల్లోనూ లాభాల బాటలో నడిచింది. ఈ కంపెనీ స్టాక్స్ 1.98 శాతం లభాల్లో ట్రేడయ్యాయి. టాటా స్టీల్ 1.44 శాతం, భారతి ఎయిర్‌టెల్ 1.22 శాతం, బీఎస్‌బీఐ 1.15 శాతం, హెచ్‌యూఎల్ 0.74 శాతం చొప్పున లాభపడ్డాయి.
ఎన్‌ఎస్‌ఈలో డాక్టర్ రెడ్డీస్ వాటాలు 2.67 నష్టాల్లో ముగిశయి. సన్‌ఫార్మా షేర్లు 2.60 శాతం పతనాన్ని ఎదుర్కొన్నాయి. హిందాల్‌కో 2.60 శాతం, ఇచర్ మోటార్స్ 2.20 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.01 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా, బీఎస్‌ఈలో మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈలోనూ టీసీఎస్ లాభాలు సంపాదించిన కంపెనీల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ కంపెనీ షేర్లు 2.25 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.60 శాతం, టాటా స్టీల్ 1.53 శాతం, ఎస్బీఐ 1.49 శాతం, జీ ఎంటర్‌టైనె్మంట్ 1.16 శాతం చొప్పున లాభాలు సంపాదించాయి.
ఇలావుంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 0.16 శాతం తగ్గి, 55.68 డాలర్లకు చేరింది. కాగా, రూపాయి మారకపు విలువ 9 పైసలు పెరిగి 71.86 రూపాయలకు చేరింది. భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరే ఒప్పందాల తీరుతెన్నులు, వాణిజ్య రంగంపై వాటి ప్రభావం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈవారం తదుపరి మార్కెట్ లావాదేవీలు కొనసాగే అవకాశాలున్నాయి.