బిజినెస్

విశాఖ నుంచి ఎగిరిన తొలి కార్గో విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఎట్టకేలకు విశాఖ పారిశ్రామికవేత్తలు, సరకు ఉత్పత్తి, ఎగుమతిదార్ల కోరిక నెరవేరింది. విశాఖ నుంచి ప్రత్యేక సరకు రవాణా విమాన సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. విశాఖ నుంచి ప్రత్యేక సరకు రవాణా విమాన సర్వీసు నడపాలని స్థానికుల నుంచి ఎంతోకాలంగా డిమాండ్ ఉంది. రవాణా విమాన సర్వీసుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా స్పైస్‌జెట్ సంస్థ ముందుకు వచ్చింది. అయితే స్పైస్ జెట్ సంస్థ అడిగిన సమయాలను కేటాయించేందుకు రక్షణ శాఖ తీవ్ర అభ్యంతరం తెలపడంతో ఈ సర్వీసు గాల్లోకి ఎగరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. అయితే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చొరవ తీసుకుని రక్షణ శాఖ ప్రతినిధులతో చర్చించిన మీదట విమానయాన సంస్థకు అనుకూలమైన సమయాన్ని కేటాయించారు. దీంతో విశాఖ నుంచి తొలిసారిగా ప్రత్యేక సరకు రవాణా విమాన సర్వీసు సేవలు ప్రారంభమయ్యాయి. చెన్నై-విశాఖ-కోల్‌కతా, చెన్నై-విశాఖ-సూరత్‌కు ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మాజీ ఎంపీ కే హరిబాబు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని, ప్రస్తుత విమాన సర్వీసులకు అదనంగా మరో 50 శాతం పెంచాల్సి ఉందన్నారు. అయితే రక్షణ శాఖ అభ్యంతరాల నేపథ్యంలో ప్రగతి నెమ్మదించిందన్నారు. త్వరలోనే అన్నీ అనుకూలించి విమానయాన ప్రయాణికులకు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నామన్నారు.
*విశాఖ నుంచి తొలి కార్గో విమాన సర్వీసును ప్రారంభిస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ