బిజినెస్

ఐటీ చట్టంలో భారీ మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: సైబర్ నేరాలను అరికట్టడంతోపాటు పలు సమస్యల నివారణ కోసం ఐటీ చట్టంలో భారీ మార్పులు తీసుకువచ్చే ప్రతిపాదన ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 20 ఏళ్ల నాటి ఈ చట్టంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఊహాతీతమైన మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు యావత్ సామాజిక ముఖచిత్రాన్ని మార్చి వేశాయని అన్నారు. వ్యక్తిగత గోప్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐటీ రంగంలో పాత చట్టాల ప్రకారమే ఇప్పటి పరిస్థితుల్లో కేసులను అధ్యయనం చేయడం లేదా స్పందించడం సమంజసం కాదని అన్నారు. జీఎస్టీ, యూపీఐ వంటి భారీ మార్పుల నేపథ్యంలో ఐటీ రంగం కూడా పూర్తిగా ఆధునీకరణ కావాల్సిన అవసరం ఉందని అన్నారు. కాలం చెల్లిన ఐటీ చట్టంలో భారీ మార్పులు అవసరం అవుతాయని ఆయన వ్యా ఖ్యానించారు. డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూ సుకువెళ్తోందని, ఈ తరుణంలో మార్పులు అత్యవసరం అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దిశగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.