బిజినెస్

1.3 లక్షల డాలర్ల ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: గత ఏడాది డిసెంబర్‌లో విదేశీ డిపాజిట్లు పెరిగాయి. అధికారిక గణాంకాల ప్రకారం నవంబర్‌లో 1,32,669 మిలియన్ డాలర్ల ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు వచ్చి చేరగా, డిసెంబర్‌లో ఆ మొత్తం 1,33,135 మిలియన్ డాలర్లుగా నమోదైంది. 2018 డిసెంబర్‌లో ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు 1,25,773 మిలియన్ డాలర్లు. గత ఏడాది జనవరిలో 1,25,204 మిలియన్ డాలర్లు చేరుకోగా, ఫిబ్రవరిలో మరికొంత పెరిగి, 1,25,599 డాలర్లకు చేరింది. మార్చి మాసం లో 1.30 లక్షల మిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించింది. ఆ మాసంలో 1,30,423 మిలియన్ డాలర్లు డిపాజిట్లు రా గా, ఏప్రిల్‌లో 1,30,909 మిలియన్ డాలర్లు గా నమోదైంది. ఈ పెరుగుదల జూన్ మా సంలోనూ కొనసాగింది. 1,33,586 మిలియ న్ డాలర్లతో అత్యధిక డిపాజిట్లు వచ్చాయి. ఆగస్టు మాసంలో 1,30,518 మిలియన్ డాల ర్లు, సెప్టెంబర్‌లో 1,32,882 మిలియన్ డాల ర్లు, అక్టోబర్‌లో 1,33,720 మిలియన్ డాలర్లు చొప్పున ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లను భారత్ సేకరించగలిగింది. నవంబర్‌లో 1,32,699 మిలియన్ డాలర్ల డిపాజిట్లు రాగా, డిసెంబర్‌లో 1,33,135 మిలియన్ డాలర్లు డిపాజిట్ల రూ పంలో వచ్చాయి. ఈ ఏడాది మరింతగా పెరుగుతాయని విశే్లషకులు ధీమాతో ఉన్నారు.