బిజినెస్

నాలుగో రోజూ పడిపోయిన సెన్సెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 26: ప్రాణాంతకమయిన కరోనా వైరస్ ప్రపంచ స్టాక్ మార్కెట్లను గడగడలాడిస్తున్న సమయంలో అందుకు అనుగుణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా బుధవారం నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెన్సెక్స్ వరుసగా నాలుగో సెషన్ బుధవారం 392 పాయింట్లు దిగజారింది. అంతకు ముందు ఇంట్రా-డేలో ఒక దశలో 521 పాయింట్లు పడిపోయిన ఈ సూచీ చివరకు క్రితం ముగింపుతో పోలి స్తే 392.24 పాయింట్ల (0.97 శాతం) దిగువన 39,888.96 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం 119.40 పా యింట్లు (1.01 శాతం) దిగువన 11,678.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. బుధవారం నాటి లావాదేవీలలో సెనె్సక్స్ ప్యాక్‌లోని సన్ ఫార్మా అత్యధికంగా నష్టపోయింది. మారుతి, ఎల్‌అండ్‌టీ, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, రిల్ తరువాత స్థానాల్లో నిలిచాయి. మరోవైపు, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్నాలజి, ఆసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటం వల్ల గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా అదే బాట పట్టాయని వ్యా పారులు తెలిపారు. తాజాగా కొత్త దేశాలలోనూ కరోనా వైరస్ కేసులు బయటపడటంతో ఈ వైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందనే భయాందోళనలు మార్కెట్ వర్గాలలో పెరిగాయని విశే్లషకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు కూడా గణనీయంగా నష్టపోయాయి. ఐరోపాలోని స్టాక్ మార్కెట్లలో ఉదయం సెషన్‌లో ప్రతికూల వాతావరణం నెలకొంది. అమెరికాలోనూ నావెల్ కరోనా వైరస్ వ్యాపిస్తుందని అంచనా వేసినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించడంతో వాల్ స్ట్రీట్‌లోనూ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఇదిలా ఉండగా, బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ ధర 1.77 శాతం పడిపోయి, బారెల్‌కు 53.30 డాలర్ల వద్దకు చేరింది. కాగా, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం ఇంట్రా-డేలో 21 పైసలు పెరిగి, 71.64కు చేరింది.