బిజినెస్

టూరిజంపై ఆస్ట్రేలియా దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 26: ఇటీవల సుమారు ఆరు నెలల పాటు చెలరేగిన కార్చిచ్చు కారణంగా లక్షలాది వన్యప్రాణులు సజీవ దహనమైన నేపథ్యంలో ఆర్థికంగా అతలాకుతలమైన ఆస్ట్రేలియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కార్చిచ్చు కారణంగా దెబ్బతిన్న పర్యాటక రంగంపై ఇప్పుడు దృష్టి సారించింది. ఈ రంగంలో భారీ పెట్టుబడుల కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే క్రికెట్‌ను మాధ్యమంగా పెట్టుకుని టూరిజంను అభివృద్ధి పరచాలని ఆశిస్తోంది. ముంబయి పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా వాణిజ్య, పర్యాటక, పెట్టుబడుల శాఖ మంత్రి సైమన్ బర్మింగ్‌హామ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మహిళల ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఇదే ఏడాది అక్కడ పురుషుల వరల్డ్ కప్ కూడా జరుగనుంది. ఆ మెగా టోర్నీకి టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయని సైమన్ ప్రకటించారు. భారతీయులు సుమారు 20 వేల టికెట్లను కొనుగోలు చేసినట్టు చెప్పారు. వరల్డ్ కప్ క్రికెట్ వల్ల తమకు మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు (4.7 కోట్ల రూపాయలు) ఆదాయం వచ్చినట్టు ఆయన అన్నారు. భారతదేశం నుంచి ఏటా భారీగా టూరిస్టులు ఆస్ట్రేలియా వస్తుంటారన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఇకపై కూడా ఇదే తరహాలో టూరిస్టులను ఆకర్షించగలుగుతామన్న ధీమా వ్యక్తం చేశారు.
2018లో 3.50 లక్షల మంది భారత పర్యాటకులు ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్తే, గత ఏడాది ఈ సంఖ్య 3,99,200కు పెరిగింది. కార్చిచ్చు వల్ల కొన్ని ప్రాంతాల్లో పర్యాటకుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని, అయితే ఆ లోటు ను రాబోయే ఐసీసీ వరల్డ్ కప్ భర్తీ చేస్తుందని సైమన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

*చిత్రం... ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లేన్ మెక్‌గ్రాత్‌తో ఆ దేశ వాణిజ్య, పర్యాటక, పెట్టుబడుల శాఖ మంత్రి సైమన్ బర్మింగ్‌హామ్