బిజినెస్

ముత్తూట్ ఫైనాన్స్‌కు ‘సెబి’ జరిమాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రకటన జారీ చేసినందుకు ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ లిమిటెడ్‌పై ‘సెబి’ జరిమాన విధించింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌సీడీ)కి సంబంధించి ఈ సంస్థ ఇస్తున్న ప్రకటనలు సాధారణ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందని సెబి ఓ ప్రకటనలో పేర్కొంది. సంస్థ జారీ చేసిన పబ్లిక్ ఇష్యూ చాలా తక్కువ కాలంలోనే వంద కోట్ల రూపాయలకు చేరుకుందని ముత్తూట్ తమ వాణిజ్య ప్రకటనలో పేర్కొంది. అంతేగాక ఆర్‌బీఐ, సెబి కూడా సంస్థ పని తీరు బాగుందని, నిలకడగా ఎదుగుతున్నదని కితాబు ఇచ్చినట్లు ప్రకటించుకుంది. ఈ వాణిజ్య ప్రకటనపై సెబి ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఇలాంటి ప్రకటనలను మానుకోవాలని తేల్చి చెప్పింది. అంతేకాక రూ.10 లక్షలు జరిమాన విధించింది.