బిజినెస్
సీఎన్‌జీ వాహనాల్లో ఢిల్లీ టాప్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: సీఎన్‌జీ వాహనాల వాడకంలో ఢిల్లీ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి ఢిల్లీలో 10,76,461 సీఎన్‌జీ వాహనాలు ఉన్నాయి. తర్వాతి స్థానాన్ని 10,01,698 వాహనాలతో గుజరాత్, దాద్రా నగర్ హవేలీ సంపాదించాయి. మహారాష్ట్ర 9,97,401 సీఎన్‌జీ వాహనాలతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. మిగతా రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్‌లో 1,64,127, హర్యానాలో 1,62,696 సీఎన్‌జీ వాహనాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రా ల్లో ఈ వాహనాల సంఖ్య వేలు, వందలు, పదుల్లోనే ఉం ది. మధ్యప్రదేశ్‌లో 36,779, తెలంగాణలో 26,196, ఆంధ్రప్రదేశ్‌లో 25,175, రాజస్థాన్‌లో 12,329, త్రిపురలో 12,260, చండీగఢ్‌లో 7,500, పశ్చిమ బెంగాల్‌లో 4,002, ఒడిశాలో 3,523, బిహార్‌లో 3,076, పంజాబ్‌లో 3,076 చొప్పున సీఎన్‌జీ వాహనాలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించే కర్నాటకలో సీఎన్‌జీ వాహనాల సంఖ్య కేవలం 1,767 మాత్రమే కావడం గమనార్హం. కేరళలో 1,100 వాహనాలు ఉంటే, దామన్ డ య్యూలో 1,000 సీఎన్‌జీ వాహనాలు ఉన్నాయి. జార్ఖండ్ (858), ఉత్తరాఖండ్ (150)లో ఈ వాహనాల సంఖ్య ఇంకా వందల దశను దాటలేదు. అస్సాంలో కేవలం 38 సీఎన్‌జీ వాహనాలు మాత్రమే ఉండడం గమనార్హం.