బిజినెస్

2వేల నోట్లు కొనసాగుతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను కేంద్రం క్రమంగా చలామణి నుంచి తొలగించబోతోందంటూ వచ్చిన కథనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిరస్కరించారు. ఈ నోట్ల చెలామణిని నిలిపివేయాలని బ్యాంకులకు ఎలాంటి ఆదేశం జారీ చేయలేదని గురువారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతుల సమావేశంలో స్పష్టం చేశారు. రెండు వేల రూపాయ కరెన్సీ ఏటీఎమ్‌లలో లభించకుండా వాటిని మళ్లీ మారుస్తున్నారన్న వార్తలనూ ఆమె తిరస్కరించారు. ఏటీఎమ్‌లో వీటిని తొలగించాలని బ్యాంకులను కోరలేదన్నారు.