బిజినెస్

మార్చి 31లోగా ఆర్టీసీ కారో గసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా మార్చి 31లోగా కార్గో సేవలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఖమ్మంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీని అభివృద్ది బాటలోకి తీసుకువచ్చేందుకు కార్గో సేవలు ప్రారంభిస్తున్నామని, ఒకేసారి వంద కార్గో బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపధ్యంలో అందుకు అనుగుణంగా బస్సులను సిద్ధం చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ కార్గో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అదే క్రమంలో ప్రభుత్వ సంస్థలైన సివిల్ సప్లైస్, బేవరేజస్, వ్యవసాయ, పశుసంవర్థక, విద్య, వైద్య, పరిశ్రమల శాఖలకు సంబంధించిన అన్ని సరఫరాలు ఆర్టీసీ కార్గోద్వారానే నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నారన్నారు. పల్లెప్రగతి స్ఫూర్పితో ప్రారంభించిన పట్టణప్రగతి అద్భుత ఫలితాలను అందిస్తోందన్నారు. అయితే పట్టణాల్లో ప్రజల సహకారం తక్కువగా ఉంటున్న నేపథ్యంలో పనులు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. ప్రజలకు కనీస వౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అన్ని వర్గాలకు సమ న్యాయం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.