బిజినెస్

2025 నాటికి 850 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: దేశ, రాష్ట్రాల్లో బొగ్గు అవసరాల కోసం సింగరేణి గనుల నుంచి 2025 నాటికి 850 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీని కోసం ఆస్ట్రేలియా నుంచి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను దిగుమతిని చేసుకుంటున్నామని సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్‌వెస్టుమెంట్ కమీషన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా- ఇండియాబిజినెస్ ఎక్సేంజ్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆస్ట్రేలియా ప్రతినిధుల నుద్దేశించి సింగరేణి సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సింగరేణితో పాటు ఒడిస్సాలో ఉన్న బొగ్గు ఉత్పత్తి కోసం అత్యాధునిక సాంకేతిక సహకారాన్ని ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోవడానికి ఒప్పందాలు కుదిరాయన్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తి అనుకున్న సమయానికి కొనుగోలు సంస్థలకు చేరవేయడానికి సులువుగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాలకు చెందని గనుల, ఖనిజాల శాఖ అధికారులు తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ సదస్సులో ఆస్ట్రేలియాకు చెందిన 11 ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరు కావడం పట్ల శుభపరిణామం అన్నారు. సింగరేణిలో రక్షణ చర్యల కోసం ఆధునిక రక్షణ పద్ధతులపై అధికారులకు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తామన్నారు. సింగరేణిలో అడ్రియాల లాంగ్‌వాల్‌లో ‘ట్యూబ్ బండిల్ ’ అనే గ్యాస్ మానిటరింగ్ సిస్టంమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. భూగర్భ, ఉపరితల గనుల్లో వివిధ రకాల యంత్రాల, టెక్నాలజీకి చెందిన సిస్టంలను ఆస్ట్రేలియా కంపెనీల నుంచి కొనుగోలు చేశాయమన్నారు. సింగరేణితో పాటు ఒడిస్సా గనుల్లో బొగ్గు ఉత్పత్తి కోసం దేశ, విదేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెపారు. తెలంగాణలో కూడా కంపెనీలు నెలకొల్పడానికి ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ కంపెనీలు ముందకు రావాలని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ సూచించారు. రాష్ట్రంలో సింగరేణితో పాటు సిమెంట్, గ్రానేట్, ఇసుక తయారీ విభాగాల్లో ఆధునిక సాంకేతిక ఎంతో అవసరమని జయేష్ అన్నారు. ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి దిగుమతి చేయడం కాన్నా, ఇక్కడే పరిశ్రమలను స్థాపించుకుని వ్యాపారం నిర్వహించుకోవటం సులభమని ఆయన గుర్తు చేశారు. సదస్సులోఎన్‌ఎండీసీ అధికారులు హాజరు అయ్యారు. జీఎం రవిశంకర్ (సీపీపీ) జీఎం పాలకుర్తి సత్తయ్య (పీపీ) డీఎన్ ప్రసాద్, ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్‌సెస్టుమెంట్ కమీషన్ ముర్రె స్పెన్స్, బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ రామకృష్ణ దాస్త్రాల హాజరయ్యారు.