బిజినెస్

పెరిగిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత బులియన్ మార్కెట్లో బంగారం ధర గురువారం పెరిగింది. 10 గ్రాముల బంగారం 78 రూపాయలు పెరిగి, 43,513 రూపాయలకు చేరింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న తరుణంలో, ఎక్కువ మంది మదుపరులు ముందు జాగ్రత్త చర్యగా బంగారం వైపు దృష్టి సారించడమే ఈ పెరుగులకు ప్రధాన కారణం. కిలో వెండి ధర 35 రూపాయలు పెరిగి, 48,130 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ సూచీలు కూడా పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం.