బిజినెస్

ఏపీలో రిలయన్స్ కొత్త ప్రాజెక్ట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 29: రాష్ట్రంలో పెట్టుబడులకు రిలయన్స్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. కొత్త ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన తనయుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ భేటీ అయ్యారు. తొలుత గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న అంబానీకి రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయి రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న అంబానీ బృందాన్ని ముఖ్యమంత్రి జగన్ సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. ఇరువురు సుమారు గంటన్నరకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాలని ముఖ్యమంత్రి కోరగా అంబానీ సానుకూలంగా స్పందించారు. రిలయన్స్ సారధ్యంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు, అనుమతుల గురించి సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో రిలయన్స్ తరుపున భాగస్వామ్యంపై ముఖేష్ అంబానీ జగన్‌తో చర్చిచారు. విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి నాడు- నేడు కింద చేపట్టిన కార్యక్రమాలు, ఇతర అంశాలు భేటీలో ప్రస్తావనకు వచ్చా యి. నాడు-నేడులో రిలయన్స్ భాగస్వామ్యంపై అంబానీని జగన్ కోరారు. ప్రాధాన్యత రంగాల్లో పెట్టుబడులకు అంబా నీ సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉండగా అంబానీతో వచ్చిన రాజ్యసభ సభ్యుడు, రిలయన్స్ సంస్థల వ్యాపా ర భాగస్వామి అయిన పరిమళ నత్వానీ.. జగన్‌ను కలవటంపై పలు రకాల ఊహాగానాలు వినవస్తున్నాయి. నత్వానీ రాజ్యసభ సభ్యత్వం గడువు ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ ముగియనుంది. జార్ఖండ్ నుంచి ఆయన ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్‌లో జేఎంఎం అధికారంలోకి రావడంతో ఆయన రాజ్యసభ సీటు అనే్వషణలో భాగంగా అంబానీతో కలిసి జగన్‌ను కలిశారనే ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రమే యం ఉందనే విషయం అధికార పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. ఈ నాలుగూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు దక్కుతాయి. ఈ నేపథ్యంలో ఆశావహులకు నచ్చచెప్పుకుని కేంద్రంతో సత్సంబంధాలు నెరపాలనే యోచనతో సీఎం జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
*చిత్రాలు..రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన తనయుడిని సత్కరించి జ్ఞాపికలను అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి