బిజినెస్

ఈ నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మార్చి మాసం.. అందునా ఆర్థిక సంవత్సరాంతం. అన్నింటికీ మించి ఎల్‌ఐసీ ఏజెంట్లు, డీవోలకు ప్రాణాంతకం. ఇంకేముంటుంది! ఏడాదిలో 11 నెలలు జరగని ఆర్థిక లావాదేవీలన్నీ ఒక్క మార్చి మాసంలోనే జరుగుతుంటాయి. అయితే దురదృష్టవశాత్తు ఊహించని రీతిలో 30రోజుల్లో 12రోజులు సెలవులు. ఒకవేళ ఏటీఎంలున్నా ఒక్కసారి వాటిల్లో డబ్బులేని స్థితి. బ్యాంక్ ఖాతాదారులు, ఆర్థిక లావాదేవీలు జరిపేవారు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవటం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ దఫా మార్చిలో ఐదు ఆదివారాలు వస్తున్నాయి. దీనికితోడు 14న రెండో శనివారం, 28న నాలుగో శనివారం. మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావటంతో 31న బ్యాంక్‌లు మూతబడతాయి. ఇక 9 లేదా 10వ తేదీ హోలీ పండుగ సెలవు. దీనికితోడు మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులు సమ్మె చేస్తామని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. నిజంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె అంటూ ఉంటే సోమవారం మినహా మార్చి రెండోవారం పూర్తిగా బ్యాంకలన్నీ మూతబడక తప్పవు. కొసమెరుపు ఏమిటంటే బ్యాంకుల సమ్మె వాయిదా పడింది.