బిజినెస్

మార్కెట్ల పయనం ఎటో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 1: భారత షేర్ మార్కెట్ల పయనం ఎటు? అనే ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు. మార్కెట్ నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. గత వారం ఎదురైన భారీ నష్టాల నుంచి మార్కెట్లు ఎంత వరకూ కోలుకుంటాయన్నది ప్రశ్న. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ గత వారం ఏకంగా 2,872.83 పాయింట్లు పతనమైన విషయం తెలిసిందే. చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో, మదుపరులు వేచిచూసే విధానాన్ని పాటిస్తున్నారు. చైనా నుంచి దిగుమతులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఫలితంగా టెక్నాలజీ, సెవలు, వౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలు గడ్డు సమస్యను ఎదుర్కోనున్నాయి. చాలా దేశాల్లో చైనా టెక్నాలజీపై ఆధారపడి ఎన్నో కంపెనీలు నడుస్తున్నాయి. వాటి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోన్న భయంతో, మదుపరులు, ప్రత్యేకించి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గత వారం వారంతా అమ్మకాలపై దృష్టి కేంద్రీకరించడంతో భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సెంటిమెంట్లు ఇంకా ప్రతికూలంగానే కొనసాగితే, గడ్డుకాలం తప్పకపోవచ్చు. గత వారం ట్రేడింగ్‌కు చివరి రోజైన శుక్రవారం నాటి భారీ పతనం నుంచి స్టాక్ బ్రోకర్లు ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. వివిధ కంపెనీల మార్కెట్ విలువ లక్షల కోట్ల రూపాయ ల్లో పతనమైంది. విదేశీ పెట్టుబడిదారులు ముం దుకు రాకపోతే, దేశీయ మదుపరులు ఆదుకుంటారా? అనే ప్రశ్నకు సమాధానం రావడం లేదు.