బిజినెస్

వరల్డ్ ఎకనమిక్ ఫోరం అవార్డుకు ‘వాటర్ హెల్త్’ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు చెందిన స్కెవాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్ధ జాతీయ స్ధాయిలో ఐదు సంస్ధలను సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన వికాస్ షా ఆఫ్ వాటర్ హెల్త్ ఇండియా సంస్ధను ఎంపిక చేశారు. బెంగళూరుకు చెందిన శాంతి రాఘవన్ దిపేష్ సూతరియా, కోహిమాకు చెందిన నేచూట్ డౌలో ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేట్, ముంబాయికి చెందిన మృణాళిని కేర్ ఆఫ్ యువ పరివర్తన్, న్యూఢిల్లీకి చెందిన హిల్మీ ఖురేషి సుభీ ఖురేషి ఆఫ్ జడ్‌ఎంక్యు సంస్ధలను ఎంపిక చేసినట్లు స్కెవాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సంస్ధ చైర్‌పర్సన్ హిల్డే స్కెవాబ్ తెలిపారు. త్వరలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ ఈ సంస్ధల యాజమాన్య ప్రతినిధులకు అవార్డులను ప్రధానం చేస్తారు.
భక్తిరస మొబైల్‌యాప్‌ను
ఆవిష్కరించిన మంగళదీప్
ఐటి సంస్ధ మంగళ్‌దీప్‌కు చెందిన అగర్ బత్తీ విభాగం పూజాస్, భజన్స్, మంత్రాస్ అండ్ మోర్ పేరిట మొబైల్ యాప్‌ను ఆవిష్కరించినట్లు ఆ సంస్ధ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విఎం రాజశేఖరన్ తెలిపారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులకు విస్తృతమైన దైవ సంబంధిత సమాచారం లభిస్తుంది. ఆలయ పూజలు ఏ విధంగా చేయాలో వివరాలు ఇస్తారు. సుప్రసిద్ధ భక్తి గీతాలు, పంచాంగ కాలెండర్, దేవాలయాల లోకేటర్ వివరాలు ఉంటాయి. తొలి దశలో ఇంగ్లీషు, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో ఈ యాప్‌ను ఆవిష్కరించార. హిందీ, బెంగాలీ భాషల్లో త్వరలో ఆవిష్కరించనున్నారు.