బిజినెస్

ఏడో రోజూ నష్టాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 2: వరుసగా ఏడో రోజు కూడా కరోనా వైరస్ భారత స్టాక్ మార్కెట్లను కుదేలు చేసింది. తాజాగా మరో రెండు కేసులు బయటపడిన నేపథ్యంలో చివరి గంట లావాదేవీల్లో మార్కెట్ భారీగా నష్టపోయింది. ఫలితంగా 153 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ 38,144.02 వద్ద ముగిసింది. సోమవారం ఆశాజనకంగా మొదలైన లావాదేవీలు చివరి గంటలోనే నష్టాలకు దారితీశాయి. ఆర్థిక, ఉక్కు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. వివిధ దశల్లో ఊగిసలాడిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా అంతిమంగా 69 పాయింట్లు నష్టపోయి 11,132.75 వద్ద ముగిసింది. ఒకదశలో నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయిన పరిస్థితి తలెత్తింది. అలాగే సెనె్సక్స్ కూడా ఒక దశలో 786 పాయింట్ల వరకు చేరుకుంది. అయితే, కొత్తగా మరో రెండు కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించడంతో ఇనె్వస్టర్లు ఒక్కసారిగా నష్టాలను తగ్గించుకోవడంలో పడ్డారు. మరో గంటలో లావాదేవీలు ముగియబోతున్నాయనగా ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ నష్టాలను చవిచూశాయంటే కరోనా వైరస్ తీవ్రత ఎంతగా ఇనె్వస్టర్లను ప్రభావితం చేస్తోందో స్పష్టమవుతోందని నిపుణులు అంటున్నారు. సెక్టార్ల వారీగా చూస్తే మెటల్, చమురు, వాయు, వౌలిక పరికరాలు, ఇంధనం, టెలికాం రంగాలకు చెందిన షేర్లు 2.05 శాతం మేర నష్టపోయాయి. ఐటీ, టెక్ కంపెనీలు స్వల్పంగా పుంజుకున్నాయి. నేటి లావాదేవీల్లో భారీగా నష్టపోయిన వాటిలో ఎస్‌బీఐ, టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకులు ఉన్నాయి. అలాగే లాభపడ్డ వాటిలో హెచ్‌సీఎల్ టెక్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే షాంఘై, హాంకాంగ్, సియోల్, టోక్యో తదితర స్టా క్ మార్కెట్లు గణనీయంగా లాభపడ్డాయి. అలాగే ఐరోపాలోని స్టాక్ మార్కెట్లు కూడా లాభాలతోనే మొదలయ్యాయి.
ప్రపంచ వృద్ధి రేటును పునరుద్ధరించేందుకు అంతర్జాతీయంగా కీలక బ్యాంకులు ఉద్దీపన పథకాలను చేపట్టబోతున్నాయన్న ఆశావహ పరిస్థితి సర్వత్రా కనిపించింది. అయితే, సరఫరా పరమైన ఇబ్బందులు కారణంగా దేశీయ ఉ త్పాదకత తగ్గింది. ఇక అమెరికా డాలర్ మారకంతో భారత రూపాయి మరో 50 పైసలు తగ్గి 72.74 వద్ద ముగిసింది. ఎగుమతులు, సరఫరా వ్యవస్థలపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల భారత ఉత్పాదకరంగ వృద్ధి రేటు ఫిబ్రవరి నెలలో మందగించింది. జనవరిలో 55.3 శాతం ఉన్న ఈ వృద్ధి రేటు ఫిబ్రవరిలో 54.5 శాతానికి తగ్గింది.