బిజినెస్

వజ్రాల ఎగుమతులకూ కరోనా దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 2: కరోనా వైరస్ ప్రభావం వజ్రాల వ్యాపారాన్ని కూడా కుంగదీస్తోంది. 2021 నాటికి భారత్ నుంచి వజ్రాల ఎగుమతులు 19 బిలియన్ డాలర్లకు తగ్గిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా డిమాండ్ మాంద్యమే దీనికి కారణమని తాజాగా వెలువడిన ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. 2018-19లో భారత్ నుంచి వజ్రాల ఎగుమతులు 24 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలంలో వజ్రాల ఎగుమతులు విలువ పరంగా 18 శాతం తగ్గాయని ఈ నివేదిక తెలిపింది. ఈ వజ్రాల ఎగుమతుల్లో 40 శాతం హాంకాంగ్‌కే జరుగుతాయి. అయితే, హాంకాంగ్‌లో స్థానిక మార్కెట్లు గత ఏడాది కాలంగా మాంద్య పరిస్థితులు ఉండడం వల్ల ఎగుమతులకు డిమాండ్ తగ్గింది. ఈ ఏడాది జనవరి 15 నుంచి హాంకాంగ్‌కు వజ్రాల ఎగుమతే జరగలేదని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసికం ముగిసే నాటికి వజ్రాల ఎగుమతులు మరింతగా తగ్గవచ్చునని తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆగ్నేయాసియా ప్రాంతంలో మార్కెట్లకు సెలవులు ప్రకటించడం, మూతపడిన కారణంగా వజ్రాల ఎగుమతులపై మరింతగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఈ నివేదిక తెలిపింది. దీని ఫలితంగా ఒక బిలియన్ డాలర్ల మేర వజ్రాల ఎగుమతులు తగ్గిపోయే అవకాశం ఉందని వివరించింది.