బిజినెస్

లాభ నష్టాలు వివరించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: ఎన్టీపీసీ, పీఎఫ్‌సీ, పవర్ గ్రిడ్‌ల నుంచి కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణల పేరిట తన వాటాను 51 శాతం కంటే దిగువకు తగ్గించుకోవాలన్న ఆలోచనపై ఇంధన మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖకు తమ అభ్యంతరాలను తెలియజేశామని ఇంధన కార్యదర్శి ఎన్‌ఎస్ సహాయ్ సోమవారంనాడు ఇక్కడ తెలిపారు. ఈ సంస్థల నుంచి వ్యూహాత్మక రీతిలో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల లాభాలతోపాటు నష్టాలు కూడా ఉంటాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదని ఆయన తెలిపారు. ఈ సంస్థల నుంచి వాటాలను ఉపసంహరించుకోవాలన్న ఆర్థిక శాఖ ప్రతిపాదనను ఇంధన శాఖ తిరస్కరించిందా అ న్న ఓ ప్రశ్నకు ‘ప్రతి ప్రతిపాదనకు రెండు కోణాలు ఉంటాయి. అవి ప్రయోజనాలు, నష్టాలు. ఈ రెండింటినీ ఆర్థిక మంత్రిత్వ శాఖకు వివరించాం’ అని జవాబిచ్చారు. అయితే, పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదని, దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.