బిజినెస్

ఆర్థిక పరిస్థితిపై ‘కరోనా’ ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణలో కరోనావైరస్ ప్రభావం సమాజ ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనావేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ‘కరోనా’ వైరస్‌ను నివారించేందుకు అన్ని కోణాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ, ఈ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదని ప్రభుత్వం సూచించడంతో రవాణాపై ఈ ప్రభావం ఉండే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. జనం ప్రయాణాలను తగ్గించుకునే అవకాశం ఉందని, దాంతో ఆర్టీసీ బస్సులు, రైళ్లు, క్యాబ్‌లు, ఆటోలు, మెట్రో రైళ్ల ప్రయాణాలపై కొద్దిరోజుల్లో ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. అలాగే వాణిజ్య సముదాయాలతో సహా సినిమా థియేటర్లు, ప్రార్థనా మందిరాలు, కాయగూరుల మార్కెట్లు, పూలమార్కెట్లు, సూపర్‌మార్కెట్లు తదితరాలపై కూడా ప్రభావం ఉండే అవకాళాలు లేకపోలేదు. విమాన ప్రయాణాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. మొత్తం మీద సామాజిక ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే కరోనా ప్రభుత్వ ఖజానాపై కూడా ప్రభావ చూపించే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.