బిజినెస్

కంపెనీ చట్టానికి భారీ సవరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సులభతర వ్యాపారం కోసం కంపెనీల చట్టంలో పెను మార్పులు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. పెద్ద నేరాలకు పాల్పడే వారిని శిక్షించే 35 సెక్షన్‌లను యథాతథంగా ఉంచుతూ కంపౌండింగ్ నేరాల సెక్షన్లలోని జైలు శిక్ష విధించే అంశాన్ని సవరించాలని నిర్ణయించింది. దీనితో పాటు కంపెనీల చట్టంలోని 65 సెక్షన్లను సవరించడం ద్వారా 72 మార్పులు చేపట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. చట్టాలను ఉల్లంఘించే వారిని నేరస్తులుగా పరిగణించే నియమాలను కంపెనీల చట్టం నుంచి తొలగించాలని నిర్ణయించింది. వ్యాపారస్తులు చట్టం ప్రకారం వ్యాపార లావాదేవీలు చేయకుండా అడ్డుకుంటున్న 72 నియమాలను మారుస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రతిపాదించే ముందు వ్యాపార సంస్థలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలతో జరిపిన చర్చలు, ఆ తరువాత ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిపారసుల మేరకు కంపెనీల చట్టంలోని 65 సెక్షన్‌లలో 72 మార్పులు చేయాలని నిర్ణయించామని ఆమె తెలిపారు. ఆర్థిక శాఖ చేసిన ఈ ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. దురుద్దేశ్యంతో చేయని పనులను కూడా నేరంగా పరిగణించే వ్యవస్థ మూలంగా వ్యాపార కార్యకలాపాలను పెరగడం లేదన్నారు. కంపెనీల చట్టంలోని 66 కాంపౌండబుల్ నేరాల నుండి 23 నేరాలను తొలగిస్తున్నామన్నారు. ఈ 22 నేరాలను ఆర్థిక శాఖ పరిధిలోని వ్యవస్థ ద్వారా పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏడు కాంపౌండబుల్ నేరాలను కంపెనీల చట్టం నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరో 11 క్షమించదగిన నేరాలకు విధించే శిక్షను జరిమానా చెల్లించటం వరకు పరిమితం చేస్తున్నాము, ఈ నేరాలకు ఇక మీదట జైలు శిక్ష పడదని ఆమె వివరించారు. మరో ఐదు కంపౌండబుల్ నేరాలను ఇతర వ్యవస్థల ద్వారా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆరు కంపౌండబుల్ నేరాల జరిమానాను తగ్గిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
50 లక్షలు అంతకంటే తక్కువ డబ్బును సీఎస్‌ఆర్‌కు ఖర్చు చేయాల్సిన కంపెనీలు ఇకమీదట సీఎస్‌ఆర్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
*చిత్రం...న్యూఢిల్లీ శాస్ర్తిభవన్‌లో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్