బిజినెస్

బీఎస్-6 ఇంధన సరఫరాకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ , మార్చి 11: దేశవ్యాప్తంగా తక్కువ కర్భన ఉద్ఘారాలు కలిగిన బీఎస్-6 ఇంధనాన్ని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ శ్రవణ్ రావు తెలిపారు. బుధవారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 వాహనాలను కోనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తగ్గట్టుగా ఇంధన నాణ్యతను సైతం పెంచినట్టు చెప్పారు. నానాటికీ పెరుగుతున్న కర్భన ఉద్ఘారాలతో వాతావరణ కాలుష్యం అవుతున్నందున బీఎస్-6 శ్రేణి ఇందనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని తాము నిర్థేశించుకున్న లక్ష్యాలను ముందుగానే చేరుకున్నట్టు చెప్పారు. సుమారుగా రూ.17వేల కోట్లను ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. బీఎస్-6 డీజిల్.. సీఎన్‌జీ కంటే తక్కువ స్థాయిలో కాలుష్యకారకాలు ఉంటాయని తెలిపారు.
గతంలో ఆయిల్స్‌లో 50 పీపీఎం సల్ఫర్ పదార్థం ఉండేదని, ప్రస్తుతం దానిని 10 పీపీఎంలకు తగ్గించామని తెలిపారు. దీంతో వాతావరణానికి మరింత మేలు జరగుతుందని అన్నారు. ఆయిల్స్ రిఫైనరీ కోసం భారీగా ఖర్చు చేసిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఐఓసీ విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వరకు నిర్మిస్తున్న పైప్‌లైన్ పనులు మరో 18 నెలల్లో పూర్తవుతాయని తెలిపారు. పనులు పూర్తయితే నేరుగా విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా అవుతుందని, రవాణ ఖర్చు భారీ తగ్గుతుందని అన్నారు. సమావేశంలో ఐఓసీ అధికారులు ప్రసాద్, చిదంబరం ,రాజశేఖర్ రాజారం పాల్గొన్నారు.