బిజినెస్

అనేక కార్పొరేట్ సంస్థలపై తాత్కాలిక ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: ఎస్ బ్యాంకుపై విధించిన తాత్కాలిక ఆంక్షలు ఆ బ్యాంకుతో సంబంధం ఉన్న అనేక కార్పొరేట్ సంస్థలపై తాత్కాలికంగా ప్రభావం చూపుతుందని, బ్యాంకు సాధారణ సేవల పునరుద్ధరణలో జరిగే జాప్యం సమీప భవిష్యత్తులో దాని కొంతమంది ఖాతాదారుల ద్రవ్యలభ్యతపై ప్రభావం చూపుతుందని రేటింగ్ ఏజెన్సీ ‘ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్’ (ఇండ్-రా) పేర్కొంది. ఎస్ బ్యాంకులో ఉన్న తమ నగదును ఖాతాదారులు ఉపసంహరించుకోవడంపై ఏప్రిల్ మూడో తేదీ వరకు ఆంక్షలు విధిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రభావాన్ని ఇండ్-రా అంచనా వేసింది. ‘తరువాత వారం నాటికి పూర్తి స్థాయి ఆపరేషనల్ హోదాను పునరుద్ధరించడంపై అడ్మినిస్ట్రేటర్ ప్రకటనతో ఆ బ్యాంకుతో సంబంధం ఉన్న అనేక కార్పొరేట్ సంస్థలకు తాత్కాలికంగా అంతరాయం కలుగుతుంది’ అని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. ఎస్ బ్యాంకు సాధారణ సేవల పునరుద్ధరణలో జరిగే జాప్యం ఆ బ్యాంకు ఖాతాదారుల ద్రవ్యలభ్యతను సమీప భవిష్యత్తులో ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఎస్ బ్యాంకుపై ఎక్కువగా ఆధారపడిన కార్పొరేట్ గ్రూపులు దీర్ఘకాలం పాటు అంతరాయాన్ని ఎదుర్కొంటాయని ఇండ్-రా వివరించింది. ఎస్ బ్యాంకును నగదు జమ, లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బ్యాంకు గ్యారంటీలు, ఇతర వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యాలు వంటి వాటికి ఉపయోగించుకుంటున్న కార్పొరేట్ సంస్థలకు ఆయా సేవలలో కూడా అంతరాయం కలుగుతుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. యెస్ బ్యాంకును సర్వీస్ ప్రొవైడర్‌గా కలిగిన ఇష్యూయర్స్‌కు వారి రోజువారీ కార్యకలాపాలపై తీవ్రమయిన ప్రభావం ఉంటుందని ఇండ్-రా పేర్కొంది.