బిజినెస్

‘ఔషధ కంపెనీల’కు 200 డాలర్ల రుణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమయిన ఔషధాలను తయారు చేస్తున్న, పంపిణీ చేస్తున్న కంపెనీలకు తాను 200 డాలర్ల (సుమారు రూ.1,480 కోట్లు) నిధులు సమకూర్చనున్నట్టు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) గురువారం నాడు తెలిపింది. ఏడీబీ సప్లై చెయిన్ ఫైనాన్స్ ప్రోగ్రాం కింద ఈ నిధులు అందుబాటులో ఉంటాయని, కొన్ని వారాలలో వీటిని ఎంపిక చేసిన కంపెనీలకు అందజేయడం జరుగుతుందని మనీలా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ విజృంభిస్తుండటం వల్ల ఆ వ్యాధి చికిత్సలో భాగంగా ఉపయోగించే ఔషధాలు, ఇతర ఉత్పత్తులు, వ్యక్తిగత రక్షణ కోసం ఉపయోగించే వస్తువుల కొరత ఏర్పడిన నేపథ్యంలో వాటి అందుబాటును, సరఫరాను పెంచడానికి ఏడీబీ ఈ నిర్ణయం తీసుకుంది.