బిజినెస్

ముడి చమురు ధర తగ్గినా మొండి చెయ్యే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన మేరకు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించవలసిన మోదీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఎక్సైజ్ పన్ను పెంచటం ద్వారా తన ఆదాయాన్ని పెంచుకుని వినియోగదారులకు మొండి చెయ్యి చూపించింది. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ పన్నును 3 రూపాయలు పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ పన్ను భారాన్ని తామే భరించాలని ఆయా పెట్రోలియం సంస్థలు నిర్ణయించటం వల్ల బంకుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగవు. అయితే కేంద్ర ప్రభుత్వానికి అదనంగా సాలీనా రూ. 39, 000 కోట్ల ఆదాయం లభిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు విపరీతంగా పడిపోయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన చమురు ధరలను దృష్టిలో పెట్టుకుని దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 3 రూపాయలు తగ్గించాల్సి ఉంటుంది. అయితే మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల తగ్గింపుప్రయోజనం వినియోదారులకు అందకుండా ఎక్సైజ్ పన్నును లీటరుకు మూడు రూపాయలు పెంచింది. ఎక్సైజ్ పన్ను పెంపు భారాన్ని తామే భరించాలని ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత్ పెట్రోలియం తదితర సంస్థలు నిర్ణయించాయి. ఈ నిర్ణయం వల్ల పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతాయి. వాస్తవానికి వినియోగదారులకు లభించవలసిన తగ్గింపుప్రయోజనాన్ని ఎక్సైజ్ పన్నును పెంచటం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన్నుకుపోతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగగానే దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా అటోమెటిక్‌గా పెంచేస్తుంటారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా తగ్గాలి. ఇప్పుడు కేంద్రం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. వినియోగదారులకు అందాల్సిన ప్రయోజనాన్ని కేంద్రం తన్నుకుపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమరు ధరలు బాగా పడిపోవటం వలన కేంద్ర ప్రభుత్వానికి ఇంత వరకు దాదాపు మూడు లక్షల కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని ఆర్థిక నిపుణులు అంచనా వేయటం గమనార్హం. పెట్రోలుపై ప్రత్యేక ఎక్సైజ్ పన్నును లీటరుకు 2 రూపాయలు, డీజిల్‌పై లీటరుకు 4 రూపాయలు పెంచినట్లు పరోక్ష పన్నుల సెంట్రల్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పెట్రోలు, డీజిల్‌పై రోడ్డు సెస్సును లీటరుకు ఒక రూపాయి పెంచినట్టు బోర్డు ప్రకటించింది. బోర్డు శనివారం ప్రకటించిన ఈ పెంపుమూలంగా లీటరు పెట్రోలుపై విధిస్తున్న మొత్తం ఎక్సైజ్ పన్ను 22.98 రూపాయలకు చేరుకోగా డీజిల్ పన్ను 18.83కు చేరింది. నరేంద్ర మోదీ 2014లో ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు పెట్రోలుపై 9.48 రూపాయలు, డీజిల్‌పై 3.56 రూపాయల ఎక్సైజ్ పన్ను ఉండేది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర పెరిగిన ప్రతిసారి పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్న ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగా తగ్గినప్పుడు మాత్రం ఈ ప్రయోజనం వినియోగదారులకు అందకుండా ఎక్సైజ్ పన్ను పెంచి తన ఖజానాను నింపుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇంత వరకు తొమ్మిది సార్లు ఎక్సైజ్ పన్నును పెంచటం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో చమరు ధరలు బాగా తగ్గటం వలన పెట్రోలు, డిజిల్ ధరలను తగ్గించకుండా యథాతథంగా ఉంచి తన ఖజానానను నింపుకుంది. దేశంలో నెలకొన్న మాంద్యం మూలంగా తగ్గిపోయిన తన ఆదాయాన్ని పెంచుకునేందుకే మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించకుండా ఎక్సైజ్ పన్నును పెంచిందని కేంద్ర ఆర్థిక, పెట్రోలియం, సహజవాయువు శాఖల సీనియర్ అధికారులు అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకప్పుడు బ్యారెల్ చమురు ధర 142 డాలర్లు ఉంటే ఇప్పుడది బాగా తగ్గిపోయి 32 డాలర్లకు చేరింది. మోదీ ప్రభుత్వం రెండు మూడు సార్లు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించినా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బాగా పడిపోయినా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించకుండా ఎక్సైజ్ పన్ను పెంచి తద్వారా తన అదాయాన్ని పెంచుకుంటోంది.