బిజినెస్

రంగంలోకి సెబీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: గత వారం భారత స్టాక్ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఒక్కసారిగా లాభాలు, అంతే హఠాత్తుగా నష్టాలు, కొనుగోళ్లకు క్యూ కట్టడం, ఆ వెంటనే అమ్మకాల ఒత్తిళ్లు పెంచడం వంటి పరస్పర విరుద్ధమైన అంశాలు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో లావాదేవీలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితిలో స్టాక్ మార్కెట్లు ఎదుర్కొంటున్న సమస్యలకు నివారణ మార్గాలను అనే్వషించడానికి సెబీ రంగంలోకి దిగింది. అవసరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ సూచీలు అంతగా ఆటుపోట్లకు గురయ్యాయో, అదే స్థాయిలో భారత స్టాక్ మార్కెట్లు కూడా సమస్యలను ఎదుర్కొన్నాయి. గత వారం మొత్తం మీద ఏ దశలోనూ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది పరిశీలకులు సైతం ఊహించలేకపోయారు. కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న రంగాలకు చెందిన షేర్లను అమ్మడానికి మదుపరులు తొలుత పరుగులు తీశారు. దీనితో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఆ వెంటనే, తక్కువ ధరలకు షేర్లను కొనే అవకాశం దక్కుతుందనే ఉద్దేశంతో తిరిగి కొనుగోళ్లపై పెట్టుబడిదారులు ఆసక్తి ప్రదర్శించారు. కొన్ని గంటల్లోనూ మదుపరుల సెంటిమెంట్లు పదేపదే మారిపోతుండడంతో, మార్కెట్ల గమనం అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిణామాలు మార్కెట్ల భవిష్యత్తుకు మంచిది కాదు. అందుకే, సమస్యలను చక్కబెట్టడానికి సెబీ నడుం బిగించింది. మార్కెట్లలో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు, ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం లేని రీతిలో తీసుకోవాల్సిన అన్ని చర్యలకూ సిద్ధమేనని స్పష్టం చేసింది. రిస్క్ మేనేజ్‌మెంట్ తీరుతెన్నులను సిద్ధం చేసే పనిలో పడింది. ఇప్పుడు కరోనా వైరస్ మాదిరిగానే, రాబోయే కాలంలో ఇలాంటి ఉపద్రవాలు ఏవైనా వచ్చిపడే అవకాశాలు లేకపోలేదన్నది వాస్తవం. అందుకే, గురువారం నాటి బీఎస్సీ ట్రేడింగ్‌లో సెనె్సక్స్ ఒకానొక దశలో 3,204.30 పాయింట్లు తగ్గినప్పటికీ, చివరిలో కొంత కోలుకోవడంతో 2,919.26 పాయింట్లు (8.18 శాతం) నష్టపోయింది. అదే విధంగా నిఫ్టీ 868.25 పాయింట్లు (8.30 శాతం) పతనమైంది. అంత భారీ నష్టాలను ఎదుర్కొన్న మరుసటి రోజే మార్కెట్లు లాభాల్లో ముగుస్తాయనేది ఎవరి ఊహకు కూడా అందదు. కానీ, గత వారం లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం సెనె్సక్స్ 1,325.32 పాయింట్లు, నిఫ్టీ 365.05 పాయింట్లు లాభాల్లో ముగిశాయి. అయితే, ఈ ట్రెండ్స్‌ను నమ్మడానికి వీల్లేదన్నది సెబీ అభిప్రాయం. ఇలాంటి అనుకోని పరిణామాలు ఎదురైనప్పుడు, మార్కెట్లు తీవ్రమైన ఆటుపోట్లకు గురైనప్పుడు పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైన చర్యలను, ప్రణాళికలను సెబీ సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
చైనాలోనే నష్టం తక్కువ..
సుమారు ఒకటిన్నర దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా భారత స్టాక్ మార్కెట్లు సుమారు 20 శాతం నష్టాలు ఎదుర్కొన్నాయి. సెబీ ప్రకటించిన వివరాల ప్రకారం, కరోనా వైరస్‌కు కారణమైన చైనాలో స్టాక్ మార్కెట్ నష్టాలు 1.78 శాతంకాగా, ఆసియా మార్కెట్లు 7 నుంచి 15 శాతం నష్టపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే, కరోనా ప్రభావం చైనా మార్కెట్ల కంటే, అక్కడి నుంచి వ్యాప్తి చెందన దేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక వైరస్‌పై ఇంత భారీ స్థాయిలో చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా కరోనా వైరస్ చర్చే కావడంతో, ప్రజల భయాందోళను రోజురోజుకూ పెరుగుతున్నాయి. అన్ని రకాల పరిశ్రమలు కుప్పకూలుతున్నాయి. దాని ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. బీఎస్సీ సూచీలు సగటున 19.51 శాతం, నిఫ్టీ 19.83 శాతం చొప్పున పతనంకాగా, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ తదితర దేశాల్లో స్టాక్ మార్కెట్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫ్రాన్స్‌లో సీఏసీ 36.35 శాతం, రష్యాలో ఆర్‌టీఎస్ 36.3 శాతం, జర్మనీలో డీఏఎక్స్ 29.43 శాతం చొప్పున నష్టపోయాయి. అదే విధంగా యూకేలో ఎఫ్‌టీఎస్‌ఈ 28 శాతం పతనమైంది.
యూఎస్ డో జోన్స్ పతనం 21 శాతంగా నమోదైంది. ఆసియా మార్కెట్లు 1987 బ్లాక్ మండే తర్వాత ఆ స్థాయి పతనం ఈవారంలోనే నమోదైంది. జపాన్, థాయిలాండ్ సూచీల పతనం మదుపరులను పూర్తి ఆత్మరక్షణలోకి నెడుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే, తీవ్రమైన ఆటుపోట్లు భారత స్టాక్ మార్కెట్లను, ఫలితంగా ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తాయి. ఈ విషయాన్ని గమనించి సెబీ పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టింది. ఇప్పుడు భారత్ మాత్రమేగాక, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని పెట్టుబడిదారులంతా సెబీ తీసుకోబోయే నిర్ణయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.