బిజినెస్

ఎలాంటి నిర్ణయం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: దేశంలో రెండు వేల రూపాయల నోట్ల మార్కెట్ నుంచి తొలగించాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్ 500 నోట్లు, 200 నోట్లకు వీలుగా ఏటీఎంలలో మార్పులు తీసుకువస్తున్నాయని ఆయన వెల్లడించారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. దేశంలో 500, 200 రూపాయల నోట్లకు విపరీతంగా డిమాండ్ పెరగడం, అలాగే 2,000 రూపాయల కరెన్సీని మార్చుకునే విషయంలో సమస్యలు తలెత్తుతున్నందున ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్‌లు 500, 200 రూపాయల కరెన్సీలకు వీలుగా ఏటీఎంలను మార్చాలని క్షేత్రస్థాయి ఆదేశాలు జారీ చేశాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 7.40 లక్షల కోట్ల విలువైన 2,000 రూపాయల కరెన్సీని ముద్రించడం జరిగిందని తెలిపారు.