బిజినెస్

మార్కెట్ మళ్లీ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 16: కరోనా వైరస్ మరోసారి స్టాక్ మార్కెట్లను కకావికలు చేసింది. మదుపరులకు కునుకు లేకుండా చేసింది. ఊపిరి పీల్చుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా రెండు రోజుల వ్యవధిలోనే మార్కెట్‌ను మరో భారీ పతనంలోకి నెట్టేసింది. కోలుకున్నట్టే కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా సోమవారంనాడు మళ్లీ చతికిలపడ్డాయి. భారత స్టాక్ మార్కెట్లు అతి తక్కువ వ్యవధిలోనే రెండోసారి కూడా కుప్పకూలడంతో 7.62 లక్షల కోట్ల మేర ఇనె్వస్టర సంపద ఆవిరైపోయింది. ఇటీవలి భయానక పరిణామాలను మార్కెట్ తట్టుకుంటోందన్న ఆశలు నిలవకముందే మరో ‘బ్లాక్ మండే’ మార్కెట్‌ను కకావికలు చేసింది. బేర్‌లు రాజ్యం చేశారు. ఫలితంగా సెన్సెక్స్ 2,713.41 పాయింట్లు అంటే 7.96 శాతం మేర నష్టాన్ని చవిచూసి, 31,390.07 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 757.80 పాయింట్లు నష్టపోయి 9,197.40 వద్ద ముగిసింది. గత నాలుగు రోజుల వ్యవధి మార్కెట్లు ఇంత భారీ స్థాయిలో పతనం కావడం ఇది రెండోసారి. అమెరికా ఫెడరల్ రిజర్వు తీసుకున్న నిర్ణయం కూడా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రభావాన్ని చూపించింది. బెంచ్ మార్క్ రేటును 0-0.25 శాతానికి తగ్గించడంతో పరిస్థితి క్షీణించింది. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలోనే అమెరికా ఫెడరల్ రిజర్వు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నేటి లావాదేవీల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధిక స్థాయిలో అంటే 17.50 శాతం నష్టపోయాయి. అదేవరుసలో టాటా స్టీల్ (11.02 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (10.94 శాతం), యాక్సిస్ బ్యాంక్ (10.38 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (9.96 శాతం) నష్టపోయాయి. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్న తీరుకు అన్ని అంతర్జాతీయ బ్యాంకులు తీసుకుంటున్న నిర్ణయాలు అద్దం పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అనుకున్న దానికంటే చాలా తీవ్ర స్థాయిలోనే వ్యాపార, వాణిజ్య పర్యాటక రంగాలపై వైరస్ ప్రభావం కనిపించింది. విమాన ప్రయాణాలు రద్దు కావడం, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం, వ్యాపార, వాణిజ్యాలు స్తంభించిపోవడం, చిన్నస్థాయి వ్యాపారాలు సైతం పరిస్థితి ప్రతిబంధకంగా మారడంతో ప్రపంచ దేశాలన్నీ అత్యవసర చర్యల్లో పడ్డాయి. కాగా, షాంఘై, హాంకాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు కూడా నేటి లావాదేవీల్లో నష్టాలను చవిచూశాయి. అమెరికా డాలర్ మారకంతో పోలిస్తే భారత రూపాయి మరో 55 పైసలు నష్టపోయి 74.31 వద్ద ముగిసింది.