బిజినెస్

విమాన సంస్థలపై కరోనా ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 16: కరోనా వైరస్ భయంతో విమాన ప్రయాణాలపై అన్ని దేశాల్లోనూ ఆంక్షలు తీవ్రం కావడంతో భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య జూన్ వరకు 50 శాతం మేర తగ్గిపోవచ్చునని తాజాగా వెలువడిన ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. రోజురోజుకూ పరిస్థితి తీవ్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానయాన సంస్థలు నష్టాల్లో మునిగిపోయాయి. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విదేశీ ప్రయాణికులందరిపైనా భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఏప్రిల్ 15వరకు వీసాలను కూడా నిలిపివేసింది. మొదట్లో కరోనా వైరస్ బారిన పడిన దేశాలకు చెందిన ప్రయాణికులపైనే ఈ నిషేధం ఉంటుందని ప్రకటించినా అనంతరం ఈ వైరస్ భయానకంగా విస్తరించడంతో ఈ నిషేధం జాబితాలో ఉన్న దేశాల సంఖ్య కూడా పెరిగింది. మార్చి-మే మధ్యకాలంలో విమానయాన పరిశ్రమపై ఈ సంక్షోభ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండవచ్చునని ఈ నివేదిక తెలిపింది. దేశీయంగా కూడా విమాన ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిపోయింది. జూన్ వరకు దేశీయ విమాన ప్రయాణాల సంఖ్య 50 శాతం కూడా ఉండకపోవచ్చునని ఈ నివేదిక తెలిపింది. జనవరిలో కరోనా వైరస్ చైనాలో తలెత్తినప్పటి నుంచే ప్రాథమికంగా దీని ప్రభావం అన్ని దేశాల విమాన ప్రయాణికులపైనే పడింది. ఒక్కొక్కటిగా దేశాలన్నీ ఇతర దేశాల విమానాలను అనుమతించకపోవడంతో, విదేశీయుల రాకనూ కట్టడి చేయడంతో పరిస్థితి సంక్షోభంగా మారింది. ఇప్పటికే వేలాది విమానాలు అంతర్జాతీయంగా రద్దయిపోయాయి. రానున్న ఒకటి, రెండు నెలల పాటు ఈ రద్దు కొనసాగవచ్చునని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా, అలాగే ఐరోపాలోని అనేక దేశాలు ఇతర దేశాలకు చెందిన ప్రయాణికులను అనుమతించడం లేదు. ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా దాదాపుగా అంతర్జాతీయ ప్రయాణికులపై ఈరకమైన ఆంక్షల అమలుకు సిద్ధమవుతున్నాయి. సంబంధిత ప్రభుత్వాలు సమన్వయరీతిలో చర్యలు తీసుకోకపోతే ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు దివాలాతీసే పరిస్థితి తప్పదని ఆసియా-పసిఫిక్ ఏవియేషన్ అధ్యయన సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఇప్పటికే దేశీయంగా ముందస్తుగా బుక్ అయిన టికెట్లు కూడా రద్దు కావడంతో భారత విమానయాన సంస్థల పరిస్థితి మరింత సమస్యాత్మకమైంది. అలాగే ప్రయాణికులు తగ్గిపోవడంతో టికెట్ల రేట్లను కూడా తగ్గించాల్సిన పరిస్థితి విమానయాన సంస్థలకు ఏర్పడింది.