బిజినెస్

మీ డిపాజిట్లు సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఎస్ బ్యాంక్ ఖాతాదారుల డిపాజిట్లు సురక్షితమని, వీటి విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం స్పష్టం చేశారు. సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్ లిక్విడిటీ పరంగా పూర్తిగా ఆదుకుంటామని మీడియా సమావేశంలో తెలిపా రు. ఈ సంక్షోభాన్ని సత్వరమే పరిష్కరించేందుకు ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఈ బ్యాంక్‌పై విధించిన మారటోరియం బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుందని, ఈ నెల 26న కొత్త బోర్డు బాధ్యతలు చేపడుతుందని తెలిపారు. ఎస్ బ్యాంక్ పునర్నిర్మాణ ప్రక్రియ విశ్వసనీయంగా, సుస్థిరంగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ చర్యల వల్ల అనుకున్న ఫలితాలు సాధ్యం కాగలవన్న ఆశాభావాన్ని ఆయ న వ్యక్తం చేశారు. అయితే, ప్రైవేటు సెక్టార్ బ్యాంక్‌గానే ఎస్ బ్యాంకు గుర్తింపును కొనసాగిస్తామని అన్నారు. ఎస్ బ్యాంక్ సంక్షోభం ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యకరంగానే పనిచేస్తోందని, ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా సురక్షితమని ఆయన వెల్లడించారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన విషయాన్ని అప్పటి పరిస్థితులను బట్టి ద్రవ్య విధాన కమిటీ తీసుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానం గా ఆయన చెప్పారు. అయితే, ఈ విషయంలో ఇప్పటికిప్పుడు తానేమీ చెప్పలేనని అన్నారు. వడ్డీ రేట్ల తగ్గింపుతోపాటు అవసరాలను బట్టి ఇతర విధానపరమైన నిర్ణయాలను ఆర్‌బీఐ తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కరోనా వైరస్ ప్రభా వం ప్రత్యక్షంగానే భారత ఆర్థిక వ్యవస్థపై ఉందని, ముఖ్యంగా వాణిజ్యపరంగా ప్రభావం తీవ్రంగా ఉందని అన్నారు. ఈ వైరస్ ప్రపంచమంతా వ్యాపిస్తోందని, భారత్‌లోనే వందకు పైగా కేసులు నమోదయ్యాయని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. అయితే, పరిస్థితిని ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని అన్నారు. వైరస్ కారణంగా బ్యాంకు వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రోత్సహించాలని తెలిపారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్