బిజినెస్

ఎస్ బ్యాంక్‌కు మంచి రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: ఎస్ బ్యాంక్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నది. వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్‌లో ఆ బ్యాంక్ షేర్ ధర పెరిగింది. ఒకేసారి 58.09 శాతం పెరగడంతో, 10 రూపాయల షేర్ విలువ 58.65 రూపాయలకు చేరింది. ఇన్‌ట్రా డేలో, ఒకానొక సందర్భంలో ఈ ధర 72.91 శాతం (64.15 రూపాయలు) వరకూ చేరింది. కానీ, ఆతర్వాత కొంత మేరకు తగ్గింది. కాగా, బ్యాంక్ మార్కెట్ విలువ ఈ మూడు రోజుల్లోనే 8,570.52 కోట్ల రూపాయలు పెరిగి, 14,958.52 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తం మీద మూడు రోజుల్లో, బీఎస్‌ఈలో 221.96 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 22 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కాగా, కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సెబీని ఆశ్రయించింది.