బిజినెస్

రెండు రోజుల్లో లక్షల కోట్లు ఆవిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: బేర్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్న నేపథ్యంలో, కేవలం రెండు రోజుల్లోనే మదుపరుల లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. సోమ, మంగళవారాల ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఫలితంగా 9,74,176.71 కోట్ల రూపాయల విలువైన సంపదను మదుపరులు నష్టపోయారు. బీఎస్‌ఈ లిస్టెడ్ జాబితాలో నష్టపోయిన కంపెనీల మార్కెట్ విలువ మంగళవారం నాటి ట్రేడింగ్ ముగిసే సమయానికి 1,19,52,066.11 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతర్జాతీయ సూచీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగా, ఆ ప్రభావం భారత మార్కెట్లపైనా స్పష్టంగా కనిపించింది. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఒక్కసారిగా కనుమరుగైంది. ఈ నష్టం నుంచి బయటపడడం మదుపరులకు అనుకున్నంత సులభం కాదని మార్కెట్ విశే్లషకులు స్పష్టం చేస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఒక రకంగా ఆర్థిక వ్యవస్థలు స్తంభించి పోతున్నాయి. భారత్ కూడా క్రమంగా కరోనా సృష్టిస్తున్న ప్రతికూల పరిస్థితుల్లోకి వెళుతున్నది. ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని, ఆర్థిక మాంద్యాన్ని, ఇతరత్రా సమస్యలను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ, పరిస్థితి ఆశాజనకంగా లేదన్నది వాస్తవం. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున, ప్రతిపక్ష పార్టీలన్నీ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి పదేపదే ప్రశ్నిస్తున్నాయి. ఆర్బీఐ గవర్నర్‌తోనూ, ఎస్బీఐ చైర్మన్‌తోనూ నిర్మలా సీతారమన్ జరిపిన చర్యలు ఎస్ బ్యాంక్‌ను గట్టెక్కించడానికి ఉపయోగపడ్డాయేతప్ప, మొత్తం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి కాదన్నది వాస్తం. ఈ పరిస్థితుల్లో, మదుపరులు మరింతగా నష్టపోకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతున్నది.
*చిత్రం... పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు వెళ్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్