బిజినెస్

ఆర్థిక మాంద్యం ఉన్నా.. పన్నుల ఆదాయంలో ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ప్రగతిశీల విధానం, ఐటీ, డేటా అనలిటిక్స్ వల్ల సానుకూల వృద్ధిరేటును సాధించింది. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 2029-20లో ఫిబ్రశరి వరకు 42,600 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి నెలలో వచ్చే ఆదాయం ద్వారా నిర్దేశించినలక్ష్యాన్ని చేరుకుంటామనే విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. 2014-15లో వాణిజ్య పన్నుల రాబడి రూ.27,700 కోట్లు, 2015-16లో 31,119 కోట్లు, 2016-17లో 35,231 కోట్లు, 2017-18లో 42,054 కోట్లు, 2018-19లో 45,379 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ వివరాలను రాష్ట్రప్రభుత్వం వాణిజ్య శాఖ పద్దుల్లో పేర్కొంది. వాణిజ్య పన్నుల శాఖ నిర్మాణాత్మకమైన సంస్కరణలను అమలు చేసింది. జీఎస్‌టీ ప్రవేశపెట్టిన తర్వాత ఈ శాఖ సర్కిళ్లను 91 నుంచి 100 సర్కిళ్లకు పెంచారు. ప్రధానపన్ను చెల్లింపుదార్లపై దృష్టి సారించేందుకు 24 ఎస్‌టీయూలను ఏర్పాటు చేశారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ను ప్రధాన కార్యాలయంలో నెలకొల్పారు. 2019-20లో రూ.46వేల కోట్ల లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించారు. ఇంతవరకు 92.61 శాతం రాబడి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అంశాలను అధ్యయనం చేసేందుకు చాలా రాష్ట్రాల అధికారులు వస్తున్నారు. కేంద్ర అధికారులతో కలిసి సమన్వయంతో రాష్ట్రం పనిచేస్తోంది. వాణిజ్యపన్నుల శాఖలో మరో రెండు డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు. జీఎస్‌టీ సంబంధిత మోసాలను సత్వరమే గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పన్ను ఎగవేసేందుకు అవకాశం ఉన్న పరిధులను వస్తువులను, ఇనుము, ఉక్కు, కలప లేదా చెక్క దుంగలు, పాలరాయి, ఆభరణాలు మొదలైన వాటిని నియంత్రిస్తారు. న్యాయపరంగా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న దావాలను సత్వరమే పరిష్కరించన్నురు. గరిష్టస్థాయి రిటర్న్‌ల దాఖలు కోసం కేంద్ర అధికారులతో కలిసి సంయుక్తంగా కార్యకలాపాలను నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉంది. చట్ట ప్రకారం అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు దాఖలు పరిచిన విధులను ఒక చైర్మన్, మరో ఇద్దరు సభ్యులున్నారు. అప్పిలేట్ డిప్యూటీ కమిషనర్ మొదటి అప్పిల్లేట్ అథారిటీగా వ్యవహరిస్తారు. వాణిజ్య పన్నుల శాఖలో 12 పరిపాలనా డివిజన్లు ఉన్నాయి.